కాలువలో లారీ బోల్తా
పెరవలి(నిడదవోలు) : నిడదవోలు –నరసాపురం కాలువలో గురువారం లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఇద్దరికి గాయాలయ్యాయి. పెరవలి నుంచి పంగిడి వెళ్తున్న లారీ తెల్లవారుజామున మంచు ప్రభావంతో అదపు తప్పటంతో లారీ వేగంగా వెళ్లి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న కాలువలో బోల్తాకొట్టింది. లారీ ఢీకొట్టిన చెట్టు కూడా విరిగి కాలువలో పడింది. లారీ డ్రైవర్ సత్యనారాయణ, క్లీనర్ ఇస్మాయిల్ అదృష్టవశాత్తూ స్వల్పగాయాలతో బయటపడ్డారు.
ఆటోను ఢీకొట్టిన లారీ - 8మందికి గాయాలు
దేవరపల్లి(గోపాలపురం) : దేవరపల్లి మండం గౌరీపట్నం వద్ద గుండుగొలను–కొవ్వూరు జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.వాసు తెలిపారు.