బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం
కొవ్వూరు : స్థానిక సత్యవతినగర్‌లోని అల్లూరి వెంకటేశ్వరరావు ముసిసిపల్ ఇండోర్ స్టేడియంలో గురువారం రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కొవ్వూరు బ్యాడ్మింటన్ అసోసియోషన్ గౌరవ అధ్యక్షుడు, ఆర్డీవో బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించడానికి ఇటువంటి టోర్నమెంటులు దోహదపడతాయన్నారు. అసోసియోషన్ అధ్యక్షుడు సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్(చిన్ని) మాట్లాడుతూ ఈ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు 5,6,7 తేదీల్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గోనే అవకాశం కల్పిస్తామన్నారు.
ఎంపిక పోటీలకు వివిధ జిల్లాల నుంచి 65 మంది క్రీడాకారులు, 30 మంది క్రీడాకారిణులు హాజరైనట్టు అసోసియోషన్ ప్రధాన కార్యదర్శి పోట్రు మురళీకృష్ణ తెలిపారు. అండర్–17 పోటీల్లో క్రీడాకారుల ఎంపికకు చీఫ్ రిఫరీగా కె.రమేష్(ప్రకాశం జిల్లా), మ్యాచ్ కంట్రోలర్‌గా జి.నాంచారయ్య వ్యవహరించారు. బ్యాడ్మింటన్ అసోసియోషన్ ఉపాధ్యక్షుడు పొట్రు శ్రీనివాసరావు, ఎల్‌ఐసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ సీహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.