in kovvur
-
డ్వాక్రా మహిళలకు వ్యాపార శిక్షణ
కొవ్వూరు రూరల్: జిల్లాలో 9 పురపాలక సంఘాల్లోని డ్వాక్రా మహిళలకు చిరు వ్యాపారాలు, తయారీ యూనిట్ల ఏర్పాటుకు శిక్షణ ఇస్తామని మెప్మా పీడీ జి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఏడాది డ్వాక్రా రుణాలకు సంబంధించి రూ.90 కోట్ల పెట్టుబడి నిధిని వారి ఖాతాల్లో జమచేశామని చెప్పారు. బుధవారం స్థానిక లిటరరీ క్లబ్ ఆవరణలో పురపాలక సంఘ పరిధిలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 494 స్వయం సహాయ సంఘాలకు రెండో విడత పెట్టుబడి నిధి సొమ్ము రూ.కోటి 47 లక్షల 45 వేల చెక్కును ఎమ్మెల్యే కేఎస్ జవహర్ చేతులమీదుగా అందజేశారు. చంద్రన్న బీమాలో నాలుగు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున బీమా సొమ్ము అందజేశారు. ఎమ్మెల్యే కేఎస్ జవహర్, ఆర్డీవో బి. శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ జొన్నలగడ్డ రాధారాణి, మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్రకుమార్, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి తదితరులు మాట్లాడారు. -
వాలీబాల్ జిల్లా మహిళా జట్లు ఎంపిక
కొవ్వూరు : జిల్లా వాలీబాల్ అసోసియోషన్ పర్యవేక్షణలో కొవ్వూరులో గౌతమీ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా మహిళా విభాగం సీనియర్, యూత్ మహిళా జట్లను ఎంపిక చేశారు. ఎంపికైన జట్లు ఈ నెల 6,7,8,9 తేదీల్లో నెల్లూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని అసోసియోషన్ అధ్యక్షుడు పరిమి హరిచరణ్ తెలిపారు. అసోసియేషన్ కార్యదర్శి సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్(చిన్ని) పాల్గొన్నారు. జాతీయస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక దేవరపల్లి: జాతీయస్థాయి ఉమెన్ ఫుట్‌బాల్ పోటీలకు జిల్లా విద్యార్థినులు ఎంపికైనట్టు జిల్లా జట్టు కోచ్ కె.వి.డి.వి.ప్రసాద్ శనివారం దేవరపల్లిలో తెలిపారు. ఇటీవల తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు 3వ స్థానం సాధించిందన్నారు. ఎం.నీరజ(దేవరపల్లి), చెరిమళ్ల సుభద్ర(కొయ్యలగూడెం), బాలుర విభాగంలో కట్టా వెంకటేశ్(నిడదవోలు) జాతీయ పోటీలకు ఎంపికైనట్టు చెప్పారు. కొయ్యలగూడెం నుంచి.. కొయ్యలగూడెం : జాతీయ స్థాయి ఉమెన్ పుట్‌బాల్ పోటీలకు స్థానిక వీఎస్ఎన్ కళాశాలకు చెందిన విద్యార్థిని సీహెచ్ సుభద్ర ఎంపికైనట్టు ప్రిన్సిపాల్ వీఎస్ఎన్స్వామి శనివారం తెలిపారు. ఇటీవల తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో ఈమె ప్రతిభ చూపినట్టు తెలిపారు. -
బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం
కొవ్వూరు : స్థానిక సత్యవతినగర్‌లోని అల్లూరి వెంకటేశ్వరరావు ముసిసిపల్ ఇండోర్ స్టేడియంలో గురువారం రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కొవ్వూరు బ్యాడ్మింటన్ అసోసియోషన్ గౌరవ అధ్యక్షుడు, ఆర్డీవో బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించడానికి ఇటువంటి టోర్నమెంటులు దోహదపడతాయన్నారు. అసోసియోషన్ అధ్యక్షుడు సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్(చిన్ని) మాట్లాడుతూ ఈ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు 5,6,7 తేదీల్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గోనే అవకాశం కల్పిస్తామన్నారు. ఎంపిక పోటీలకు వివిధ జిల్లాల నుంచి 65 మంది క్రీడాకారులు, 30 మంది క్రీడాకారిణులు హాజరైనట్టు అసోసియోషన్ ప్రధాన కార్యదర్శి పోట్రు మురళీకృష్ణ తెలిపారు. అండర్–17 పోటీల్లో క్రీడాకారుల ఎంపికకు చీఫ్ రిఫరీగా కె.రమేష్(ప్రకాశం జిల్లా), మ్యాచ్ కంట్రోలర్‌గా జి.నాంచారయ్య వ్యవహరించారు. బ్యాడ్మింటన్ అసోసియోషన్ ఉపాధ్యక్షుడు పొట్రు శ్రీనివాసరావు, ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్ సీహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.