ఆలయాలు రికార్డుల పరిశీలన
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి, జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయాల రికార్డులను గురువారం దేవాదాయ« శాఖ మల్టీజోన్–2 ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఎస్‌ఎస్ చంద్రశేఖర్ అజాద్ పరిశీలించారు. ఆలయ అధికారులు, సిబ్బందితో కమిషనర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆలయ భూముల పరిరక్షణ తీరు ఎలా ఉంది అన్న విషయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయానికి వస్తున్న భక్తులకు అందిస్తున్న సేవలు, అభివృద్ధి పనుల తీరుపై సమీక్షించారు. అనంతరం మద్ది, పారిజాతగిరి, జంగారెడ్డిగూడెంలో సీతారామస్వామి, వేణుగోపాలస్వామి ఆలయాలను, బొర్రంపాలెం, టి.నర్సాపురం గ్రామాల్లో ఆలయ భూములను ఆయన పరిశీలించారు. మద్ది ఆలయ ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు, జంగారెడ్డిగూడెం గ్రూపు ఆలయాల ఈవో గాదిరాజు వీర వెంకట రవికుమార్, పారిజాతగిరి ఆలయ చైర్మన్ బిక్కిన సత్యనారాయణ, మద్ది ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.