మద్ది హుండీ ఆదాయం రూ.27,04,522
Published Fri, Sep 9 2016 12:39 AM | Last Updated on Mon, Jul 29 2019 6:07 PM
గుర్వాయిగూడెం (జంగారెడ్డిగూడెం రూరల్) : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారి హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. దేవాదాయశాఖ తనిఖీదారు కేవీవీ రమణ పర్యవేక్షణలో 85 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. రూ.27,04,522 నగదు, 10 గ్రాముల బంగారం, 134 గ్రాముల వెండి, 9 విదేశీ నోట్లు లభించినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు చెప్పారు. చైర్మన్ ఇందుకూరి రంగరాజు, సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement