16 నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు
Published Fri, Jul 29 2016 12:44 AM | Last Updated on Mon, Jul 29 2019 6:07 PM
ద్వారకాతిరుమల : ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్య పవిత్రోత్సవాలు వచ్చే నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరపనున్నట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసి తెలియక జరిగిన తప్పుల ప్రాయశ్చిత్తం నిమిత్తం ఈ ఉత్సవాలను నిర్వహించడం పరిపాటి. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని ప్రారంభం రోజైన ఆగస్టు 16న అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. 17న పవిత్రాధివాసం, 18న పవిత్రారోపణ, 19న పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని ఈవో వివరించారు. ఆలయంలో జరగాల్సిన నిత్యార్జిత సేవలు, ఆర్జిత కల్యాణాలు ఉత్సవాల రోజుల్లో రద్దు చేయనున్నట్టు ఆయన తెలిపారు.
Advertisement
Advertisement