ఆక్వా పరిశ్రమతో మా పొట్టలు కొట్టొద్దు | WITH AUQA INDUSTRY WE ARE LOSED | Sakshi
Sakshi News home page

ఆక్వా పరిశ్రమతో మా పొట్టలు కొట్టొద్దు

Published Fri, Aug 19 2016 12:43 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

WITH AUQA INDUSTRY WE ARE LOSED

మొగల్తూరు : గొంతేరు డ్రెయిన్‌ కాలుష్యం కాకుండా కాపాడుకుందామని మత్స్యకారులు ప్రతిన పూనారు. గురువారం ముత్యాలపల్లి పంచాయతీ చింతరేవులోని గొంతేరు డ్రెయిన్‌లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆక్వా పరిశ్రమ ఏర్పాటు చేసి తమ పొట్టలు కొట్టవద్దని ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్వా పరిశ్రమ ఏర్పాటు చేస్తే జీవనది లాంటి గొంతేరు కాలుష్యం బారిన పడి జీవనాధారమైన వేటను కోల్పోతామన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లాటి వెంకటరెడ్డి, అబ్బులు, సామోరు, భూచక్రవర్తి, ఏడుకొండలు, తిరుమాని గోపాలస్వామి, రంగమ్మ, కొల్లాట సన్యాసమ్మ, అనంతలక్ష్మి, మారెమ్మ, కొల్లాటి నాగమణి, వాటాల ధనలక్ష్మి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement