రాష్ట్రంలో అరాచక పాలన | rastramlo arachaka palana | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో అరాచక పాలన

Published Thu, Nov 10 2016 10:36 PM | Last Updated on Tue, May 29 2018 3:42 PM

రాష్ట్రంలో అరాచక పాలన - Sakshi

రాష్ట్రంలో అరాచక పాలన

నిడదవోలు : రాష్ట్రం, జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల అధికార అండదండలతో అరాచక పాలన సాగుతోందని, దోపిడీ రాజ్యమేలుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనకు చమరగీతం పాడేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని పిలుపునిచ్చారు. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలోని పోలిరెడ్డి కల్యాణ మండపంలో పార్టీ మండల అ««దl్యక్షుడు అయినీడి పల్లారావు అధ్యక్షతన గురువారం  మండలస్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆళ్ల నాని మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చిన పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి  పరిష్కారం కోసం పాటుపడుతున్నారని చెప్పారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా బాసటగా నిలుస్తున్నారన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని గ్రామాల్లో సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. 
కార్యాచరణ ప్రణాళికతో..
కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని ఆళ్ల నాని చెప్పారు. పార్టీ నిర్మాణానికి కార్యచరణ ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. మండల స్థాయి నాయకులు, కార్యకర్తలను పార్టీలో భాగస్వాములు చేయాలన్నారు.  జిల్లాలో చేపడుతున్న గడపగడపకూ వైఎస్సార్‌ కార్యక్రమంలో ప్రజలు ఎందుకు టీడీపీకి ఓట్లు వేశామని సిగ్గుతో తలవంచుకుంటున్నారని చెప్పారు. జన చైతన్య యాత్రల పేరుతో ప్రజాధనాన్ని టీడీపీ నాయకులు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.  వైఎస్సార్‌ సీపీలోకి రావడానికి యువత ఆసక్తి కనబరుస్తోందన్నారు.  
నిధులు పక్కదారి
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ నిధులు పక్కదారి పట్టించి, వాటితో టీడీపీ నాయకులు విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆళ్ల నాని ఆరోపించారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజీవ్‌కృష్ణ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. త్వరలో గ్రామ కమిటీలు నియమిస్తామన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముళ్లపూడి శ్రీనివాస్‌చౌదరి మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాల అమలులో జన్మభూమి కమిటీల పెత్తనం పెరిగిందని, పేదలకు పథకాలు అందడం లేదని విమర్శించారు. మండల అధ్యక్షుడు అయినీడి పల్లారావు మాట్లాడారు. 
పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సాయిబాలా పద్మ, ఎంపీపీ మన్యం సూరిబాబు, శ్రీపాణి అలవాల రాజు, ఉప్పులూరి రామ్మోహనరావు, ఆత్కూరి దొరయ్య, యాళ్ళ రామారావు , పాఠంశెట్టి మధు, మద్దిపాటి ఫణీంద్ర, వెలగన సత్యనారాయణ, గుమ్మాపు రోహిణీబాబు, ఎస్‌కె మీరాసాహెబ్, కస్తూరి సాగర్, పుల్లూరి రామమూర్తి, కొప్పుల రామదేవుడు, వెలగన పోలయ్య తదితరులు పాల్గొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement