శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లాలోని 38 జెడ్పీటీసీ స్థానాలకుగానూ 296 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి మూడు రోజులు 103 రాగా చివరి రోజైన గురువారం 193 నామినేషన్లను అభ్యర్థులు దాఖలు చేశారు. 296 నామినేషన్లలో బీఎస్పీ-2, బీజెపీ 12, సీపీఐ 9, వైఎస్‌ఆర్‌సీపీ 121, కాంగ్రెస్ 23, టీడీపీ 110, లోక్‌సత్తా 2, సీపీఎం-5, స్వతంత్రులు 12 దాఖలయ్యాయి.
మొత్తం నామినేషన్ల వివరాలిలా ఉన్నాయి. మండలాల వారీగా ఇచ్ఛాపురం -9, కవిటి 7, కంచిలి -7, సోంపేట -12, మందస - 6, పలాస - 9, వజ్రపుకొత్తూరు నుంచి ఐదు, నందిగాం నుంచి 9, టెక్కలి నుంచి 5, సంతబొమ్మాళి నుంచి ఏడు, కోటబొమ్మాళి నుంచి ఐదు, జలుమూరు- ఐదు, మెళియాపుట్టి - ఎనిమిది, పాతపట్నం ఆరు, సారవకోట- 12, హిరమండలం- ఆరు, కొత్తూరు - ఆరు, భామిని-17, సీతంపేట-13, వీరఘట్టం నుంచి ఏడు, వంగర నుంచి 10, పాలకొండ- ఎనిమిది, రేగిడి ఆమదాలవలస ఐదు, రాజాం నుంచి ఎనిమిది, సంతకవిటి నుంచి ఏడు, జి.సిగడాం నుంచి నాలుగు, పొందూరు నుంచి 10 నామినేషన్లు దాఖల య్యాయి.
అలాగే ఆమదాలవలస నుంచి ఏడు, బూర్జ నుంచి తొమ్మిది, సరుబుజ్జిలి నుంచి ఏడు, ఎల్‌ఎన్‌పేట నుంచి ఎనిమిది, నరసన్నపేట నుంచి మూడు, పోలాకి నుంచి ఐదు, గార నుంచి ఏడు, శ్రీకాకుళం నుంచి ఎనిమిది, ఎచ్చెర్ల నుంచి 11, లావేరు నుంచి ఏడు, రణస్థలం నుంచి 11 నామినేషన్లు దాఖలయ్యాయి.
చివరి రోజున...
చివరి రోజున 193 నామినేషన్లు దాఖలు కాగా ఇచ్ఛాపురం నుంచి 5, కవిటి నుంచి 4, కంచిలి నుంచి 1, సోంపేట నుంచి 6, మందస 4, పలాస నుంచి 9, వజ్రపుకొత్తూరు నుంచి 3, నందిగాం నుంచి 3, టెక్కలి నుంచి 3, సంతబొమ్మాళి నుంచి 5, కోటబొమ్మాళి నుంచి 3, జలుమూరు నుంచి 4, మెళియాపుట్టి నుంచి రెండు, పాతపట్నం నుంచి ఐదు, హిరమండలం నుంచి నాలుగు, కొత్తూరు నుంచి ఆరు, భామిని నుంచి నాలుగు, సీతంపేట నుంచి 13, వీరఘట్టం నుంచి నాలుగు, సంతకవిటి నుంచి ఏడు, పాలకొండ నుంచి ఐదు, సారవకోట నుంచి ఎనిమిది, వంగర నుంచి ఆరు, రేగిడి ఆమదాలవలస నుంచి ఐదు, రాజాం నుంచి ఎనిమిది, జి.సిగడాం నుంచి నాలుగు, పొందూరు నుంచి ఆరు, పోలాకి నుంచి నాలుగు, ఎచ్చెర్ల నుంచి 10, లావేరు నుంచి ఐదు, రణస్థలం నుంచి ఆరు, శ్రీకాకుళం నుంచి ఏడు, గార నుంచి ఆరు, బూర్జ నుంచి నాలుగు, ఆమదాలవలస నుంచి మూడు, సరుబుజ్జిలి నుంచి ఏడు, ఎల్‌ఎన్‌పేట నుంచి నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 3,550 నామినేషన్లు దాఖలయ్యాయి.
జెడ్పీటీసీలకు 296 నామినేషన్లు
Published Fri, Mar 21 2014 3:52 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM
Advertisement
Advertisement