పోరు వీరులు వీరే.. | ended the lok sabha, general election nominations | Sakshi
Sakshi News home page

పోరు వీరులు వీరే..

Published Thu, Apr 24 2014 12:13 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

ended the lok sabha, general election nominations

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
ఎంపీ బరిలో 50 మంది, ఎమ్మెల్యే బరిలో 250 మంది
ప్రధాన పోటీ వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీల మధ్యే..
నేటి నుంచి హోరెత్తనున్న ప్రచారం

 
అమలాపురం, న్యూస్‌లైన్ : నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారం ముగియడంతో జిల్లాలోని మూడు లోక్‌సభ, 19 శాసనసభ స్థానాలకు బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. ఉపసంహరణ తరువాత లోక్‌సభ బరిలో 50 మంది, అసెంబ్లీ బరిలో 250 మంది నిలిచారు. పలు చోట్ల ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు కూడా బరిలో ఉన్నా.. పోటీ ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీల మధ్యేనని చెప్పొచ్చు. బరిలో నికరంగా తలపడేది ఎవరో తేలడంతో గురువారం నుంచి ప్రచారం జోరందుకోనుంది.
 
 కాకినాడ ఎంపీ స్థానానికి 26 మంది నామినేషన్లు వేశారు. రెండు తిరస్కారానికి గురికాగా, ఇద్దరు ఉపసంహరించుకున్నారు. చలమలశెట్టి సునీల్ (వైఎస్సార్ సీపీ), తోట నరసింహం (టీడీపీ), ఎం.ఎం.పళ్లంరాజు (కాంగ్రెస్), తుమ్మలపల్లి సత్యరామకృష్ణ (జేఎస్పీ) సహా 22 మంది పోటీలో నిలిచారు. రాజమండ్రి ఎంపీ స్థానానికి 16 నామినేషన్లు పడగా ఒకటి తిరస్కరణకు గురైంది.
 
 
ఒకరు ఉపసంహరించుకోగా బొడ్డు వెంకటరమణ చౌదరి (వైఎస్సార్ సీపీ), మాగంటి మురళీమోహన్ (టీడీపీ), కందుల దుర్గేష్ (కాంగ్రెస్), ముళ్లపూడి సత్యనారాయణ (జేఎస్పీ) సహా 14 మంది బరిలో నిలిచారు. అమలాపురం ఎంపీ స్థానానికి 18 నామినేషన్లు దాఖలు కాగా మూడు చెల్లలేదు. ఒకరు వైదొలగిన అనంతరం పినిపే విశ్వరూప్ (వైఎస్సార్ సీపీ), పండుల రవీంద్రబాబు (టీడీపీ), ఎ.జె.వి.బి.మహేశ్వరరావు (కాంగ్రెస్), జి.వి.హర్షకుమార్ (జేఎస్పీ) సహా 14 మంది బరిలో నిలిచారు.
 
 శాసనసభ బరిలో వీరే..
 రాజమండ్రి రూరల్ : ఈ స్థానానికి 21 నామినేషన్లు పడగా, ఐదు తిరస్కరణకు గురయ్యాయి. ముగ్గురి ఉపసంహరణ తర్వాత ఆకుల వీర్రాజు (వైఎస్సార్ సీపీ), గోరంట్ల బుచ్చయ్య చౌదరి (టీడీపీ), రాయుడు రాజవల్లి (కాంగ్రెస్), చిక్కాల ఉమామహేశ్వరరావు (జేఎస్పీ)సహా 13 మంది బరిలో నిలిచారు.
 

రాజమండ్రి సిటీ : మొత్తం 27 నామినేషన్లు దాఖలు కాగా రెండింటిని తిరస్కరించారు. ఐదుగురు ఉపసంహరించుకోగా బొమ్మన రాజ్‌కుమార్ (వైఎస్సార్‌సీపీ), ఆకుల సత్యనారాయణ (బీజేపీ), వాసంశెట్టి గంగాధర్ (కాంగ్రెస్), శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం (జేఎస్పీ) సహా 20 మంది బరిలో నిలిచారు.
 
రాజానగరం : ఇక్కడ 13 నామినేషన్లు పడగా ఒకటి తిరస్కరణకు గురైంది. ఇద్దరు ఉపసంహరించుకున్నాక జక్కంపూడి విజయలక్ష్మి (వైఎస్సార్‌సీపీ), పెందుర్తి వెంకటేష్ (టీడీపీ), అంకం నాగేశ్వరరావు (కాంగ్రెస్), వడ్డి శ్రీనివాస నాయుడు (జేఎస్పీ) సహా బరిలో పది మంది ఉన్నారు.
 
అనపర్తి : మొత్తం 21 మంది నామినేషన్లు వేయగా మూడింటిని తిరస్కరించారు. ఇద్దరు ఉపసంహరించుకోవడంతో డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి (వైఎస్సార్‌సీపీ), నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (టీడీపీ), అద్దంకి ముక్తేశ్వరరావు (కాంగ్రెస్), తేతలి నారాయణరెడ్డి (జేఎస్పీ) సహా 16 మంది పోటీలో ఉన్నారు.
 

తుని : మొత్తం 15 మందిలో ఆరుగురు ఉపసంహరించుకున్నా దాడిశెట్టి రాజా (వైఎస్సార్‌సీపీ), యనమల కృష్ణుడు (టీడీపీ), డాక్టర్ సి.హెచ్.పాండురంగారావు (కాంగ్రెస్), మెరుసు లీలా శ్రీనివాస్ (జేఎస్పీ) సహా తొమ్మిది మంది బరిలో ఉన్నారు.  
 
ప్రత్తిపాడు : ఇక్కడ 14 నామినేషన్లు పడగా రెండు చెల్లుబాటు కాలేదు. ఒకరి ఉపసంహరణ అనంతరం వరుపుల సుబ్బారావు (వైఎస్సార్‌సీపీ), పర్వత చిట్టిబాబు (టీడీపీ), పర్వత పూర్ణచంద్రప్రసాద్ (కాంగ్రెస్), ఎల్లపు లక్ష్మణరావు (జేఎస్పీ), ముద్రగడ పద్మనాభం (స్వత్రంత) సహా బరిలో 11 మంది మిగిలారు.
 
జగ్గంపేట : మొత్తం 16 మంది నామినేషన్లు వేయగా రెండు తిరస్కారానికి గురయ్యాయి. ముగ్గురు ఉపసంహరించుకున్నాక జ్యోతుల నెహ్రూ (వైఎస్సార్‌సీపీ), జ్యోతుల చంటిబాబు (టీడీపీ), తోట రవి (కాంగ్రెస్), మేడిబోయిన గోవిందరాజులు (జేఎస్పీ) సహా 11 మంది బరిలో ఉన్నారు.
 
 పిఠాపురం : మొత్తం 20 నామినేషన్లు దాఖలు కాగా, ఐదుగురు ఉపసంహరించుకున్నారు. పెండెం దొరబాబు (వైఎస్సార్‌సీపీ), పోతుల విశ్వం (టీడీపీ), పంతం ఇందిర (కాంగ్రెస్), అరవ వెంకటాద్రి (జేఎస్పీ) సహా 15 మంది బరిలో నిలిచారు. ఇక్కడ టీడీపీ నుంచి వర్మ రెబల్‌గా బరిలో ఉన్నారు.
 

పెద్దాపురం : ఇక్కడ 26 నామినేషన్లు దాఖలు కాగా ఏడు తిరస్కరణకు గురయ్యాయి. ఆరుగురు ఉపసంహరించుకోగా తోట సుబ్బారావునాయుడు (వైఎస్సార్‌సీపీ), నిమ్మకాయల చినరాజప్ప (టీడీపీ), తుమ్మల దొరబాబు (కాంగ్రెస్), చింతం వెంకటరమణ (జేఎస్పీ) సహా బరిలో 13 మంది మిగిలారు.
 
   కాకినాడ సిటీ : మొత్తం 24 మంది నామినేషన్లు వేయగా ఐదు నామినేషన్లు తిరస్కారానికి గురయ్యాయి. ముగ్గురు ఉపసంహరించుకున్నారు. ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి (వైఎస్సార్‌సీపీ), వనమాడి వెంకటేశ్వరరావు (టీడీపీ), పంతం నానాజీ (కాంగ్రెస్), ముత్తా వెంకట శశిధర్ (జేఎస్పీ) సహా 16 మంది పోటీలో నిలిచారు.
 
కాకినాడ రూరల్ : మొత్తం 25 నామినేషన్లు పడగా నాలుగింటిని తిరస్కరించారు. నలుగురు పోటీ నుంచి తప్పకున్నాక చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (వైఎస్సార్‌సీపీ), పిల్లి అనంతలక్ష్మి (టీడీపీ), పళ్లచోళ్ల వెంకట సీతారామస్వామి నాయుడు (కాంగ్రెస్), వాసిరెడ్డి ఏసుదాసు (జేఎస్పీ), కురసాల కన్నబాబు (స్వతంత్ర) సహా 17 మంది పోటీ పడుతున్నారు.
 

మండపేట : దాఖలైన నామినేషన్లు 17 కాగా, మూడు తిరస్కారానికి గురయ్యాయి. ఇద్దరు ఉపసంహరించుకోగా గిరజాల వెంకటస్వామి నాయుడు (వైఎస్సార్‌సీపీ), వేగుళ్ల జోగేశ్వరరావు (టీడీపీ), కామనప్రభాకరరావు (కాంగ్రెస్), హేమా సయ్యద్ (జేఎస్పీ) సహా 12 మంది పోటీలో ఉన్నారు.
 
రామచంద్రపురం : దాఖలైన 20 నామినేషన్లూ సక్రమంగా ఉండగా ముగ్గురు ఉపసంహరించుకున్నారు. పిల్లి సుభాష్‌చంద్రబోస్ (వైఎస్సార్‌సీపీ), తోట త్రిమూర్తులు (కాంగ్రెస్), నందా జాన్‌విక్టర్ బాబు (కాంగ్రెస్), తలాఠం వీరరాఘవులు (జేఎస్పీ) సహా 17 మంది బరిలో నిలిచారు.
 

ముమ్మిడివరం : మొత్తం 20 మంది నామినేషన్లు వేయగా మూడు తిరస్కారానికి గురయ్యాయి. నలుగురు ఉపసంహరించుకోగా గుత్తుల సాయి (వైఎస్సార్‌సీపీ), దాట్ల బుచ్చిబాబు (టీడీపీ), గంగిరెడ్డి త్రినాథ్‌రావు (కాంగ్రెస్), తిరుమాని స్వామి నాయకర్ (జేఎస్పీ), కోలా త్రిమూర్తులు (బీఎస్పీ) సహా 13 మంది పోటీలో నిలిచారు.
 

అమలాపురం : మొత్తం 16 మంది నామినేషన్లు దాఖలు చేయగా రెండు తిరస్కరణకు గురయ్యాయి. ముగ్గురు ఉపసంహరించుకున్నాక గొల్లబాబూరావు (వైఎస్సార్ కాంగ్రెస్), అయితాబత్తుల ఆనందరావు (టీడీపీ), జంగా గౌతమ్ (కాంగ్రెస్), నెల్లి కిరణ్‌కుమార్ (జేఎస్పీ) సహా బరిలో 11మంది ఉన్నారు.
 
పి.గన్నవరం : మొత్తం 15 నామినేషన్లు దాఖలు కాగా మూడు తిరస్కారానికి గురయ్యాయి. ఇద్దరు ఉపసంహరించుకున్నాక కొండేటి చిట్టిబాబు (వైఎస్సార్‌సీపీ), పులపర్తి నారాయణమూర్తి (టీడీపీ), పాముల రాజేశ్వరీదేవి (కాంగ్రెస్), జి.వి.శ్రీరాజ్ (జేఎస్పీ) సహా 12 మంది బరిలో మిగిలారు.
 
 రాజోలు : దాఖలైన నామినేషన్లు 16 కాగా ఆరుగురు ఉప సంహరించుకున్నారు.బొంతు రాజేశ్వరరావు (వైఎస్సార్‌సీపీ), గొల్లపల్లి సూర్యారావు (టీడీపీ), సరెళ్ల విజయప్రసాద్ (కాంగ్రెస్), మత్తి జయప్రకాష్ (జేఎస్పీ), రాపాక వరప్రసాద్ (స్వతంత్ర) సహా  పది మంది బరిలో ఉన్నారు.
 

కొత్తపేట : 15 నామినేషన్లు పడగా రెండు తిరస్కారానికి గురయ్యాయి. ఇద్దరి ఉపసంహరణతో చిర్ల జగ్గిరెడ్డి (వైఎస్సార్‌సీపీ), బండారు సత్యానందరావు (టీడీపీ), ఆకుల రామకృష్ణ (కాంగ్రెస్), కె.వి.సత్యనారాయణరెడ్డి (జేఎస్పీ), కాండ్రేగుల నర్శింహులు (బీఎస్పీ) సహా 11 మంది బరిలో నిలిచారు.
 
రంపచోడవరం : ఇక్కడ 21 మంది నామినేషన్లు వేయగా ఆరింటిని తిరస్కరించారు. ముగ్గురు ఉపసంహరించుకున్నాక వంతల రాజేశ్వరీ దేవి (వైఎస్సార్ సీపీ), శీతంశెట్టి వెంకటేశ్వరరావు (టీడీపీ), కోసూరి కాశీవిశ్వనాథ్(కాంగ్రెస్), లక్కొండ రవికుమార్ (జేఎస్పీ) సహా పోటీలో 13 మంది ఉన్నారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement