నేడు పాల దిగుబడి పోటీలు
Published Thu, Jan 12 2017 12:06 AM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM
పెనుమంట్ర (ఆచంట) : సంక్రాంతి సంబరాల్లో భాగంగా పెనుమంట్ర మండలంలోని వెలగలేరులో గురువారం రాష్ట్రస్థాయి ఒంగోలు ఆవుల పాల దిగుబడి పోటీలు నిర్వహించనున్నారు. నిబంధనల ప్రకారం ఉదయం, సాయంత్రం రెండుపూటలా న్యాయ నిర్ణేతల సమక్షంలో పాలు పితకాలి. ఈ సందర్భంగా గెలుపొందిన ఆవులకు కాసు, అరకాసు, పావుకాసు బంగారం చొప్పున ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా అందజేయనున్నారు. పాల దిగుబడి పోటీలతో పాటు పళ్ల అందాల పోటీల్లో గెలుపొందిన పశువులకు నగదు బహుమతులు అందజేయనున్నట్టు పోటీల నిర్వహణ కమిటీ చైర్మన్ గుడిమెట్ల సోమిరెడ్డి తెలిపారు.
Advertisement
Advertisement