నేటి నుంచి రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్స్‌ | from today state level school games | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్స్‌

Published Wed, Nov 9 2016 11:09 PM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM

from today state level school games

నారాయణపురం (ఉంగుటూరు) : రాష్ట్రస్థాయి అండర్‌–19 బాల, బాలికల స్కూల్‌ గేమ్స్, సపక్‌ తక్రా పోటీలు నారాయణపురం బాపిరాజు స్టేడియంలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్టు ఈ పోటీలకు సంబంధించి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే  స్టేడియంను ముస్తాబు చేస్తున్నారు. అండర్‌–19 స్కూల్‌గేమ్స్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఎ.ఇస్సాక్, ఒలింపిక్స్‌ జిల్లా అసోసియేష న్‌ కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ, కళాశాల ప్రిన్సిపాల్‌ వి.సోమశేఖర్‌ ఏర్పాట్లను  పరిశీలించారు. రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి 130 మంది క్రీడాకారులు తరలిరానున్నట్టు చెప్పారు. ఈ పోటీలు ఉదయం నుంచి జరుగుతాయన్నారు. క్రీడాకారులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆదిరెడ్డి సత్యానారాయణ తెలిపారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement