in narayanapuram
-
నేటి నుంచి రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్
నారాయణపురం (ఉంగుటూరు) : రాష్ట్రస్థాయి అండర్–19 బాల, బాలికల స్కూల్ గేమ్స్, సపక్ తక్రా పోటీలు నారాయణపురం బాపిరాజు స్టేడియంలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్టు ఈ పోటీలకు సంబంధించి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే స్టేడియంను ముస్తాబు చేస్తున్నారు. అండర్–19 స్కూల్‌గేమ్స్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎ.ఇస్సాక్, ఒలింపిక్స్ జిల్లా అసోసియేష న్ కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ వి.సోమశేఖర్ ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి 130 మంది క్రీడాకారులు తరలిరానున్నట్టు చెప్పారు. ఈ పోటీలు ఉదయం నుంచి జరుగుతాయన్నారు. క్రీడాకారులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆదిరెడ్డి సత్యానారాయణ తెలిపారు. -
అక్నూ మహిళ క్రికెట్ జట్టు ఎంపిక
నారాయణపురం (ఉంగుటూరు) : స్థానిక వివేకానంద జెడ్పీ హైçస్కూల్ ఆవరణలో మంగళవారం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రాజమండ్రి(అక్నూ)మహిళా క్రికెట్ జట్టును ఎంపిక చేశారు. స్థానిక అరవింద శతజయంతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తిరుపాణ్యం, హైస్కూల్ హెచ్ఎం ఎం.ఉషారాణి, సెలెక్టర్లు జి.కుసమ కుమారి, కేవీడీ ప్రసాద్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ, సాలాపురి మూర్తి పర్యవేక్షించారు. ఎంపికైనట్టు వచ్చేనెల 9న చెన్నైలో జరగనున్న అఖిల భారత అంతర విశ్వవిద్యాలయ టోర్నమెంట్లో పాల్గొంటారు. యూనివర్సిటీ జట్టు ఇదే.. సీహెచ్ కవిత, పి.శ్రీ లేఖ, కె.రబిక, ఎం.పోసి రత్నం, ఎ.చిన్నారి, పి.శిరీష, టి.ప్రశాంతి(దేవరపల్లి), కె.లావణ్య, పి.జ్యోత్న్స(జంగారెడ్డి గూడెం), ఎం.ఈశ్వరి, డి.పూజిత(తణుకు), ఎన్.తేజ శ్రీ సత్య, కె.శ్రీ రూప(కాకినాడ), బి.నాగమణి(రాజమండ్రి), టి.నాగజ్యోతి(దేవనపల్లి), ఎస్.శాంతి( తుని). -
రోప్ స్కిప్పింగ్ చాంపియన్ ‘పశ్చిమ’
నారాయణపురం (ఉంగుటూరు) : స్థానిక సమతా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సంస్థ ఆవరణలో రెండు రోజులు నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్–14, 17, 19 రోప్ స్కిప్పింగ్ పోటీలలో ఓవరాల్ చాంపియన్‌గా పశ్చిమ గోదావరి జిల్లా జట్టు విజయం సాధించింది. ద్వితీయ స్ధానం తూర్పు గోదావరి జిల్లా, తృతీయ స్ధానం నెల్లూరు జట్లు గెలిచాయి. విజేతలకు ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు బహుమతులు అందజేశారు. తొలుత క్రీడాకారుల రోప్ స్కిప్పింగ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. క్రీడలను సమర్ధవంతంగానిర్వహించటం ప్రశంసనీయం బహుమతి ప్రదానోత్సవ సభలో ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయలు మాట్లాడుతూ గ్రామీణప్రాంతంలో క్రీడలను సమర్థవంతంగా నిర్వహించటం అభినందనీయం అన్నారు. రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి భాష మాట్లాడుతూ పశ్చిమ గోదావరి నుంచే రోప్ స్కిప్పింగ్ పోటీలు ప్రారంభం కాగా నేడు అంతర్జాతీయంగా ఈ క్రీడకు పేరు ప్రఖ్యాతలు లభించాయన్నారు. కార్యక్రమంలో సమత గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అధ్యక్షత, కార్యదర్శులు పొత్తూరి శ్రీనివాసరాజు, ఉద్దరాజు గణపతి వర్మ, రాష్ట్ర క్రీడా సంస్థ సమన్వయ కర్త రవీంద్రనా«థ్, అండర్–19 స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఐజాక్, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ, ఉంగుటూరు ఏఎంసీ చైర్మన్ పీవీ కుమార్, టీడీపీ మండల అధ్యక్షుడు కడియాల రవిశంకర్, భీమడోలు జెడ్పీటీసీ కర్ణం పెద్దిరాజు, కృష్ణా జిల్లా రోప్ స్కిప్పింగ్ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, క్రీడల పరిశీలకులు సరస్వతి, గురువెల్లి రాజారావు, తిలక్ పాల్గొన్నారు.