అక్నూ మహిళ క్రికెట్ జట్టు ఎంపిక
అక్నూ మహిళ క్రికెట్ జట్టు ఎంపిక
Published Tue, Sep 27 2016 10:53 PM | Last Updated on Thu, Oct 4 2018 4:40 PM
నారాయణపురం (ఉంగుటూరు) : స్థానిక వివేకానంద జెడ్పీ హైçస్కూల్ ఆవరణలో మంగళవారం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రాజమండ్రి(అక్నూ)మహిళా క్రికెట్ జట్టును ఎంపిక చేశారు. స్థానిక అరవింద శతజయంతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తిరుపాణ్యం, హైస్కూల్ హెచ్‌ఎం ఎం.ఉషారాణి, సెలెక్టర్లు జి.కుసమ కుమారి, కేవీడీ ప్రసాద్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ, సాలాపురి మూర్తి పర్యవేక్షించారు. ఎంపికైనట్టు వచ్చేనెల 9న చెన్నైలో జరగనున్న అఖిల భారత అంతర విశ్వవిద్యాలయ టోర్నమెంట్‌లో పాల్గొంటారు.
యూనివర్సిటీ జట్టు ఇదే..
సీహెచ్ కవిత, పి.శ్రీ లేఖ, కె.రబిక, ఎం.పోసి రత్నం, ఎ.చిన్నారి, పి.శిరీష, టి.ప్రశాంతి(దేవరపల్లి), కె.లావణ్య, పి.జ్యోత్న్స(జంగారెడ్డి గూడెం), ఎం.ఈశ్వరి, డి.పూజిత(తణుకు), ఎన్.తేజ శ్రీ సత్య, కె.శ్రీ రూప(కాకినాడ), బి.నాగమణి(రాజమండ్రి), టి.నాగజ్యోతి(దేవనపల్లి), ఎస్.శాంతి( తుని).
Advertisement
Advertisement