రోప్‌ స్కిప్పింగ్‌ చాంపియన్‌ ‘పశ్చిమ’ | rope scipping champion "west' | Sakshi
Sakshi News home page

రోప్‌ స్కిప్పింగ్‌ చాంపియన్‌ ‘పశ్చిమ’

Published Sun, Sep 18 2016 9:25 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

రోప్‌ స్కిప్పింగ్‌ చాంపియన్‌ ‘పశ్చిమ’

రోప్‌ స్కిప్పింగ్‌ చాంపియన్‌ ‘పశ్చిమ’

నారాయణపురం (ఉంగుటూరు) : స్థానిక సమతా గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ సంస్థ ఆవరణలో రెండు రోజులు నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్‌–14, 17, 19 రోప్‌ స్కిప్పింగ్‌ పోటీలలో ఓవరాల్‌ చాంపియన్‌గా పశ్చిమ గోదావరి జిల్లా జట్టు విజయం సాధించింది. ద్వితీయ స్ధానం తూర్పు గోదావరి జిల్లా, తృతీయ స్ధానం నెల్లూరు జట్లు గెలిచాయి. విజేతలకు ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు బహుమతులు అందజేశారు. తొలుత క్రీడాకారుల రోప్‌ స్కిప్పింగ్‌ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 
క్రీడలను సమర్ధవంతంగానిర్వహించటం ప్రశంసనీయం
బహుమతి ప్రదానోత్సవ సభలో ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయలు మాట్లాడుతూ గ్రామీణప్రాంతంలో క్రీడలను సమర్థవంతంగా నిర్వహించటం అభినందనీయం అన్నారు. రోప్‌ స్కిప్పింగ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి భాష మాట్లాడుతూ పశ్చిమ గోదావరి నుంచే రోప్‌ స్కిప్పింగ్‌ పోటీలు ప్రారంభం కాగా నేడు అంతర్జాతీయంగా ఈ క్రీడకు పేరు ప్రఖ్యాతలు లభించాయన్నారు. కార్యక్రమంలో సమత గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ అధ్యక్షత, కార్యదర్శులు పొత్తూరి శ్రీనివాసరాజు, ఉద్దరాజు గణపతి వర్మ,  రాష్ట్ర క్రీడా సంస్థ సమన్వయ కర్త రవీంద్రనా«థ్, అండర్‌–19 స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి ఐజాక్, జిల్లా ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ, ఉంగుటూరు ఏఎంసీ చైర్మన్‌ పీవీ కుమార్, టీడీపీ మండల అధ్యక్షుడు కడియాల రవిశంకర్, భీమడోలు జెడ్పీటీసీ కర్ణం పెద్దిరాజు, కృష్ణా జిల్లా రోప్‌ స్కిప్పింగ్‌ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, క్రీడల పరిశీలకులు సరస్వతి, గురువెల్లి రాజారావు, తిలక్‌ పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement