సత్తా చాటిన ఫుట్‌బాల్ జట్లు
సత్తా చాటిన ఫుట్‌బాల్ జట్లు
Published Sat, Oct 29 2016 10:34 PM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM
తాడేపల్లిగూడెం : జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా స్థానిక డాక్టర్ తేతలి సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో నిర్వహించిన పుట్‌బాల్ పోటీలు శనివారం సాయంత్రం ముగిశాయి. బాలుర విభాగంలో జి.పంగిడిగూడెం ఫుట్‌బాల్ క్లబ్ జట్టు, సీనియర్ మెన్స్ విభాగంలో ఏలూరు, దేవరపల్లి జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. అండర్ –16 బాలుర రన్నరప్‌గా దేవరపల్లి పుట్‌బాల్ క్లబ్ నిలిచింది. విజేతలకు పట్టణ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్ మూర్తి బహుమతులను అందజేశారు. పోటీలకు రిఫరీగా ఎన్.ఓం ఫణి వ్యవహరించారు. ఈ పోటీల ద్వారా జిల్లాలో ప్రతిభ కలిగిన వంద మంది క్రీడాకారులను ఎంపికచేసినట్టు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బెల్లంకొండ సుబ్బారావు తెలిపారు. జ్యోతి నర్సింగ్ స్కూల్ నిర్వాహకుడు దత్తు వెంకటేశ్వరరావు, ప్లో సీఈవో రాజేష్ రావూరి పాల్గొన్నారు .
Advertisement
Advertisement