దివ్యాంగుల పింఛన్లకు రూ.805 కోట్లు
దివ్యాంగుల పింఛన్లకు రూ.805 కోట్లు
Published Sat, Dec 3 2016 10:29 PM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM
తాడేపల్లిగూడెం రూరల్ : రాష్ట్రంలో దివ్యాంగులకు ఏటా రూ.805 కోట్లతో పింఛన్‌లు అందిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. శనివారం స్థానిక సుబ్బారావుపేట ఎలిమెంటరీ మునిసిపల్ పాఠశాలలో సర్వశిక్షాభియాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో మంత్రి మాణిక్యాలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రూ.72 కోట్లు ఏటా పింఛన్లుగా అందిస్తున్నామన్నారు. విభిన్న ప్రతిభావంతులను సకలాంగులు వివాహం చేసుకుంటే రూ. 50 వేలు ప్రోత్సాహకంగా అందిస్తున్నట్టు చెప్పారు. మునిసిపల్ పాఠశాలలో ప్రత్యేక గది, ప్రత్యేక మరుగుదొడ్డి ఏర్పాటుకు తల్లిద్రండులు కోరగా మంత్రి స్పందించి వెంటనే ప్రత్యేక గదులు, మరుగుదొడ్డి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అంగవైకల్యం పొందిన పిల్లలను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. ఎస్‌ఎస్‌ఏ పీవో బ్రహ్మానందరెడ్డి, దత్త విశ్వరూప సమితి అధ్యక్షుడు వలవల సూరిబాబు మాట్లాడారు. అనంతరం మంత్రి మాణిక్యాలరావు కేక్ కట్ చేసి పిల్లలకు తినిపించారు. ఎంపీపీ గన్నమని దొరబాబు, ఎంపీడీవో వై.దోసిరెడ్డి, మండల యువమోర్చా అధ్యక్షుడు వన్నెంరెడ్డి నవీన్‌కుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement