వైఎస్సార్ సీపీలోకి టీడీపీ కార్యకర్తలు
సత్యవరం(పెనుమంట్ర) : సత్యవరం గ్రామానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో వైఎస్సార్ సీపీలో చేరారు. గురువారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆచంట నియోజకవర్గ పార్టీ కన్వీన కవురు శ్రీనివాస్ సమక్షంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ బందుల సూరయ్య, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి గెడ్డం విఘ్నేశ్వరరావు నాయకత్వంలో దాదాపు 50 మంది కార్యకర్తలు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరారు. వారిని శ్రీనివాసు పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పారు. గెడ్డం ఈశ్వర్, బాలం బులినర్సయ్య, బాలం శ్రీరాములు, కట్టా శ్రీను, కట్టా కనకయ్య తదితరులు వైఎస్సార్ సీపీలో చేరిన వారిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మేడపాటి చంద్రమౌళీశ్వరరెడ్డి, మండల కన్వీనర్ కర్రి వేణుబాబు, కార్యదర్శి ఉన్నమట్ల మునిబాబు, సీనియర్ నాయకులు నల్లిమెల్లి ప్రభాకరరెడ్డి, వీరవల్లి స్వామి, జిల్లా రైతుకమిటీ కార్యదర్శి పడాల అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప
ల