‘డీఎన్నార్‌’ డిగ్రీ ఫలితాలు విడుదల | ‘dnr’ degree results release | Sakshi
Sakshi News home page

‘డీఎన్నార్‌’ డిగ్రీ ఫలితాలు విడుదల

Published Thu, Apr 27 2017 9:41 PM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM

‘డీఎన్నార్‌’ డిగ్రీ ఫలితాలు విడుదల

‘డీఎన్నార్‌’ డిగ్రీ ఫలితాలు విడుదల

భీమవరం : భీమవరం డీఎన్నార్‌ డిగ్రీ కళాశాలలో పరీక్షా ఫలితాలను కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు గాదిరాజు సత్యనారాయణరాజు గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధికి, నేటి టెక్నాలజీకి అనుగుణంగా తమ కళాశాలలో కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నట్టు  చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్‌ పి.రామకృష్ణంరాజు మాట్లాడుతూ డిగ్రీ పరీక్షా ఫలితాల్లో బీఏ గ్రూపులో 83 శాతం, బీఎస్సీలో 64 శాతం, బీకాం (జనరల్‌) 94 శాతం, బీకాం (ఒకేషనల్‌) 90 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. బీఎస్సీలో Ðð జయశ్రీ 91.96 శాతం మార్కులతో ప్రథమస్థానంలో నిలవగా పి.సత్యనాగ శ్రావణి 91.88 శాతంతో ద్వితీయ, వి.నాగప్రసన్న 90.48 శాతం మార్కులతో తృతీయ స్థానంలో నిలిచినట్టు వెల్లడించారు. విద్యార్థులకు పరీక్షా పత్రాల రీవాల్యేషన్, ప్రత్యక్ష పరిశీలనకు మే 5వ తేదీ వరకూ అవకాశం ఉందన్నారు. అలాగే మే 8 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు రామకృష్ణంరాజు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎంవీ రఘుపతిరాజు, కళాశాల కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ అల్లూరి సురేంద్ర, అడిషనల్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ పీవీ రామరాజు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement