కార్మిక బీమాపై కలెక్టర్ సమీక్ష
Published Fri, Nov 4 2016 12:24 AM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM
ఏలూరు (మెట్రో) : జిల్లాలో అసంఘటిత కార్మికులకు ప్రమాదం ద్వారా గాని సాధారణంగా కానీ మరణిస్తే ఆ వివరాలు పంచాయతీ, రెవెన్యూ అధికారుల ద్వారా చంద్రన్న బీమా కాల్‌సెంటర్‌కు తెలపాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించిన చంద్రన్న బీమా అమలుపై డీఆర్‌డీఏ, కార్మిక, డ్వామా, మెప్మా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో దురదృష్టవశాత్తూ వాహన ప్రమాదం లేదా సాధారణ మరణం సంభవించినప్పుడు గ్రామంలోని కాల్ సెంటర్ నంబర్ 155214కు సంబంధిత గ్రామ వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి తప్పనిసరిగా వారి వివరాలు ఎస్‌ఎంఎస్ ద్వారా అందించాలని కలెక్టర్ చెప్పారు. గ్రామ మహిళా సంఘ సమాఖ్య కాల్ సెంటర్ వివరాలను అదే రోజు ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ డేటాలో పొందు పరుస్తారన్నారు. మరణించిన వ్యక్తి పేరు కాల్ సెంటర్‌లో రిజిస్టర్ చేయించిన 7 రోజుల్లోపు పంచాయతీ లేదా మునిసిపల్ కార్యాలయం నుంచి ధ్రువపత్రం, పోలీస్ శాఖ నుంచి ప్రమాద ఎఫ్‌ఐఆర్ లేదా శవపంచనామా రిపోర్టును మెడికల్ డిపార్ట్‌మెంట్ ద్వారా తీసుకుని ఆ¯ŒSలై¯ŒS ద్వారా సంబంధితాదికారులు కాల్ సెంటర్‌కు పంపాల్సి ఉంటుందని కలెక్టర్ చెప్పారు. డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసులు, డ్వామా ప్రతినిధి పి.కుమార్ పాల్గొన్నారు.
Advertisement