క్రమంగా ఎయిడ్స్ తగ్గుముఖం
క్రమంగా ఎయిడ్స్ తగ్గుముఖం
Published Thu, Dec 1 2016 11:54 PM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
ఏలూరు (మెట్రో) : ఎయిడ్స్ సోకేవారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందని సమాజంలో అందరి భాగస్వామ్యంతో ఎయిడ్‌్సరహిత జిల్లాగా తీర్చిదిద్దడం కష్టం కాదని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక ఇండోర్ స్టేడియంలో ఎయిడ్స్ ప్రచార ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెరిగిందన్నారు. మంచి ఆహారం, మానసిక ధైర్యం కల్పిస్తే హెచ్‌ఐవీ సోకిన బాధితులు 20 నుంచి 25 సంవత్సరాలు అదనంగా జీవించవచ్చని అందుకే హెచ్‌ఐవీ బాధితులకు మనోధైర్యాన్ని కల్పించాలని భాస్కర్ కోరారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, మేయర్ నూర్జహా¯ŒS, డీఎంహెచ్‌వో కె.కోటేశ్వరి తదితరులు మాట్లాడారు. డీసీహెచ్‌ఎస్ శంకరరావు, ఏలూరు కమిషనర్ యర్రా సాయిశ్రీకాంత్, మాజీ డెప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం పాల్గొన్నారు.
Advertisement