కొవ్వూరు మునిసిపల్ చైర్మన్‌గా రాధారాణి ఎన్నిక
Published Fri, Sep 30 2016 12:48 AM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
కొవ్వూరు : కొవ్వూరు పురపాలక సంఘం నూతన చైర్మన్‌గా 19వ వార్డు కౌన్సిలర్ జొన్నలగడ్డ రాధారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఎన్నికల అధికారిగా గురువారం చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. రాధారాణిని చైర్మన్ అభ్యర్థిగా మునిసిపల్ మాజీ చైర్మన్ సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్ (చిన్ని) ప్రతిపాదించారు. వైస్ చైర్మన్ దుద్దుపూడి రాజా రమేష్ ఆమె పేరును బలపరిచారు. ఎక్స్ ఆఫీషియో సభ్యుడు కేఎస్ జవహర్‌తో పాటు 22 మంది సభ్యులు రాధారాణిని చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆర్డీవో బి.శ్రీనివాసరావు, కమిషనర్ టి.నాగేంద్రకుమార్ పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం మునిసిపల్ వైస్ చైర్మన్‌గా కిల్లాడి ప్రసాద్
తాడేపల్లిగూడెం : మునిసిపల్ వైస్ చైర్మన్‌గా 34వ వార్డు కౌన్సిలర్ కిల్లాడి ప్రసాద్ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవి కోసం ఒక నామినేషన్ మాత్రమే పడటంతో కిల్లాడిని ఏకగ్రీవంగా వైస్ చైర్మన్‌గా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ఏలూరు ఆర్డీవో నంబూరి తేజ్‌భరత్ ప్రకటించారు .
Advertisement
Advertisement