kvr
-
జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కేవీఆర్ మృతి
సాక్షి, మెట్పల్లి(కోరుట్ల)/కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, మెట్పల్లి ఖాదీ ప్రతిష్టాన్ చైర్మన్ కేవీ రాజేశ్వర్‌రావు(84) హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. మల్లాపూర్ మండలం మొగిలిపేటకు చెందిన కేవీ ఆ గ్రామ సర్పంచ్‌గా రెండు దశాబ్దాలపాటు పని చేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత పార్టీలో చేరిన ఆయన 2001లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో మెట్పల్లి నుంచి పోటీచేసి గెలుపొందారు. అనంతరం కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెట్పల్లి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో 2005లో కాంగ్రెస్‌లో చేరారు. 2008లో మెట్పల్లి ఖాదీ ప్రతిష్టాన్ చైర్మన్‌గా నియమితులైన కేవీ ఇప్పటికీ ఆ పదవిలో కొనసాగుతున్నారు. జిల్లా పరిషత్ చరిత్రలో అత్యధిక నిధులు తీసుకువచ్చిన చైర్మన్‌గా ఘనత సాధించారు. రాజేశ్వర్‌రావుకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కేవీ మృతిపట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మున్సిపల్ చైర్పర్సన్ రాణవేని సుజాత, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, ధర్మపురి దేవస్థానం కమిటీ మాజీ అధ్యక్షుడు జువ్వాడి కృష్ణారావు సంతాపం తెలిపారు. -
పశ్చిమ డెల్టాకు 4,280 క్యూసెక్కులు
కొవ్వూరు : పశ్చిమ డెల్టా ఆయకట్టుకు సాగునీటి అవసరాల నిమిత్తం శనివారం 4,280 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 8,240 క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు. దీనిలో తూర్పు డెల్టాకు 2,400, సెంట్రల్ డెల్టాకు 1,560 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. ఏలూరు కాలువకు 694, అత్తిలి కాలువకు 358, నరసాపురం కాలువకు 1,534, ఉండి కాలువకు 997, జీ అండ్ వీకి 489 క్యూసెక్కుల చొప్పున సాగునీరు అందిస్తున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 13.21 మీటర్లుగా నమోదైంది. -
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం
కొవ్వూరు : పట్టణంలో రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలను జిల్లా అదనపు సెషన్స్ జడ్జి వైవీఎస్జీబీ పార్ధసారథి శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు. గౌతమీ స్పోర్ట్స్ అండ్ కల్చలర్ అసోసియోషన్ పదేళ్లుగా పోటీలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. రానున్న రోజుల్లో జాతీయస్థాయి పోటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. క్రీడాకారులు ఇటువంటి టోర్నమెంటులను సద్వినియోగ పరచుకుని జాతీయస్థాయిలో రాణించాలని సూచించారు. అసోసియోషన్ అధ్యక్షుడు పరిమి హరిచరణ్ మాట్లాడుతూ పదిహేనేళ్లుగా రాష్ట్రస్థాయి పోటీలతో పాటు వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. తమ అసోసియోషన్ వద్ద శిక్షణ పొందిన ఎంతో మంది క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణిస్తున్నారన్నారు. ఆర్డీవో బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కొవ్వూరులో క్రీడలను ప్రోత్సహించే ఔత్సహికులుండడం అభినందనీయం అన్నారు. శాశ్వత క్రీడా సదుపాయాలు ఏడాదిలో సమకూరే అవకాశం ఉందన్నారు. కొవ్వూరులో స్టేడియం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. వచ్చే ఏడాదికి గ్రౌండ్ సమస్య తీరుతుందన్నారు. అసోసియోషన్ కార్యదర్శి సూరపనేని చిన్ని, వైస్ చైర్మన్ దుద్దుపూడి రాజారమేష్, బ్యాడ్మింటన్ అసోసియోషన్ కార్యదర్శి పొట్రు మురళీకృష్ణ, టీడీపీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు పొట్రు శ్రీనివాసరావు, నాయకులు సూర్యదేవర రంజిత్, బొబ్బా సుబ్బారావు మాట్లాడారు. అనంతరం అతిథులు సర్వీసు చేసి పోటీలను ప్రారంభించారు. ప్రకాశం, కృష్ణ జిల్లా జట్లు తొలిమ్యాచ్‌లో తలపడ్డాయి. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు జాతీయ చీఫ్ రిఫరీ డి.నేతాజీ తెలిపారు. నేషనల్ రిఫరీలు బి.శ్రీనివాసరావు, పి.సుబ్బారెడ్డి, రాష్ట్రస్థాయి రిఫరీలు ఆర్.సురేష్, ఎస్కే మస్తాన్ వలీ, కె.రామ్‌కుమార్ ఎంఫైర్లుగా వ్యవహరిస్తున్నారు. నాయకులు పరిమి రామకృష్ణ, పరిమి రాజేష్, పోలవరం ప్రాజెక్టు డీఈఈ ఎన్ పీ రాజేశ్వరరావు పాల్గొన్నారు. -
గోదావరివాసుల అప్యాయత ఎంతో ఇష్టం
కొవ్వూరు : గోదావరివాసులు అప్యాయత ఎంతో ఇష్టమని సినీనటి, టీవీ యాంకర్ ఝాన్సీ తెలిపారు. కొవ్వూరులో విక్టర్ సూపర్ బజార్ ప్రారంభోత్సవానికి శుక్రవారం వచ్చిన ఆమె విలేకర్లతో మాట్లాడారు. తాను ఇప్పటివరకు సుమారు 50 సినిమాలు, ఐదు వేలకు పైగా సీరియల్స్, టీవీ ప్రోగ్రాంలలో పాల్గొన్నట్టు చెప్పారు. మూడు వందల సినిమాల్లో నటించానని గౌతంరాజు తెలిపారు. తన కుమారుడు కృష్ణంరాజు హీరోగా 'లక్ష్మీదేవి సమర్పించే నేడే చూడండి' అనే సినిమా ఈ నెల 30న విడుదల కానున్నట్టు చెప్పారు. తనను ఆధారించినట్టే తన కొడుకు కృష్ణంరాజును ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. -
ఆటోను ఢీకొట్టిన కారు
కొవ్వూరు : పట్టణంలోని టోల్గేట్ జంక్షన్ సమీపంలో రోడ్డు కం రైలు వంతెనపై ఎదురుగా వచ్చిన మోటార్‌సైకిల్‌ను తప్పించే క్రమంలో కారు ఆటోను ఢీకొట్టింది. కారు అదుపుతప్పి వంతెన దిగువకు వెళ్లి ఆగిపోయింది. ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ మేకల శ్రీనివాసరావు స్వల్పంగా గాయపడ్డాడు. ఆటోలో ప్రయాణిస్తున్న ఏలూరి ప్రభాకరావు, కమల కుమారి సురక్షితంగా బయటపడ్డారు. చాగల్లు నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న ఆటోను రాజమహేంద్రవరం నుంచి పెనకనమెట్ట వస్తున్న కారు ఢీకొట్టడంతో ఈప్రమాదం జరిగింది. రోడ్డు కం రైలు వంతెన అప్రోచ్రోడ్డులో జరిగిన ఈ ప్రమాదంలో కారు రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో సిమెంట్ దిమ్మె కారు దిగువున ఇరుక్కుంది. ఎదురుగా చెట్ల కొమ్మల్లో ఇరుక్కోవడంతో కారు ముందుకు వెళ్లలేదు. కారుకు దిగువన తాటాకిళ్లు ఉన్నాయి. కారు అదుపు తప్పితే ఇళ్లల్లోకి దూసుకెళ్లి ఉండేది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. -
గోష్పాద క్షేత్రంలో జ్వాలాతోరణం
కొవ్వూరు: కార్తీక పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని ఏటిగట్టుపై ఉన్న అన్నపూర్ణ, విశాలాక్షి సమేత కాశీవిశ్వేశ్వరస్వామి పంచాయతన శివాలయంలో సోమవారం ప్రత్యేక మంచులింగం ఏర్పాటు చేయనున్నట్టు ఆలయ నిర్వాహకులు మల్లిన సత్యనారాయణ తెలిపారు. సాయంత్రం 5 నుంచి భక్తుల దర్శనం కోసం అందుబాటులో ఉంచుతామన్నారు. గోదావరికి నీరాజనం, జ్వాలాతోరణం కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం స్వామి వారికి ఊరేగింపు ఉంటుంది. గోష్పాదlక్షేత్రంలోని సుందరేశ్వరస్వామి ఆలయంలో సాయంత్రం జ్వాలాతోరణం నిర్వహించనున్నట్టు ఆలయ నిర్వాహకులు మానేపల్లి శ్రీనివాసమూర్తి తెలిపారు. ఆలయంలో స్వామి వారికి విశేష పూజలతో పాటు పల్లకీ సేవ నిర్వహిస్తామని సత్యనారాయణ చెప్పారు. -
నిర్లక్ష్యంపై విద్యార్థినుల ఆగ్రహం
- ప్రహరీ నిర్మించాలంటూ భారీ ధర్నా - స్థలాన్ని కబ్జా చేస్తే ఊరుకోబోమంటూ హెచ్చరిక కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): నగరంలోని కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు పిడికిలి బిగించారు. ప్రహరీ నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ కళాశాల ఎదుట శుక్రవారం భారీ ధర్నా నిర్వహించారు. కళాశాలలో మైదాన స్థలాన్ని కబ్జా చేస్తున్నారని ఇలాగైతే న్యాక్గుర్తింపు లభించదని..వేల మంది విద్యార్థినులు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సుమారు రెండు గంటలపాటు విద్యార్థినులు.. న్యాయం కావాలి అంటూ నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కళాశాల ప్రహరీ నిర్మాణ పనులను మధ్యలో నిలిపివేయడంతో తాగుబోతులు, తిరుగుబోతులు కళాశాలలోకి ప్రవేశిస్తున్నారన్నారు. కళాశాలలో మొత్తం రెండు వేల మంది విద్యార్థినులు వసతి పొందుతున్నారని..మునిసిపల్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ సీవీ రాజేశ్వరీ, వైస్ ప్రిన్సిపాల్ వీరాచారి, అధ్యాపకురాలు ఇందిరాశాంతి కోరారు. నిబంధనలు మేరకు రోడ్డుకు ఇరువైపులా ఆరు మీటర్ల వరకు రోడ్డును విస్తరించుకోవచ్చనని విద్యార్థులు తెలిపారు. దీన్ని మరచిన అధికారులు కళాశాల స్థలాన్ని 28 మీటర్ల వరకు ఓ ప్రజాప్రతినిధి అనుచరులకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే పనులను నిలిపివేసినట్లు ఆరోపించారు. జూన్‌లో కూల్చిన ప్రహరీని నిర్మించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మునిసిపల్ అధికారులు నిబంధనలు మేరకు పనులను చేపట్టకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని విద్యార్థినులు హెచ్చరించారు. -
కొవ్వూరు మునిసిపల్ చైర్మన్‌గా రాధారాణి ఎన్నిక
కొవ్వూరు : కొవ్వూరు పురపాలక సంఘం నూతన చైర్మన్‌గా 19వ వార్డు కౌన్సిలర్ జొన్నలగడ్డ రాధారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఎన్నికల అధికారిగా గురువారం చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. రాధారాణిని చైర్మన్ అభ్యర్థిగా మునిసిపల్ మాజీ చైర్మన్ సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్ (చిన్ని) ప్రతిపాదించారు. వైస్ చైర్మన్ దుద్దుపూడి రాజా రమేష్ ఆమె పేరును బలపరిచారు. ఎక్స్ ఆఫీషియో సభ్యుడు కేఎస్ జవహర్‌తో పాటు 22 మంది సభ్యులు రాధారాణిని చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆర్డీవో బి.శ్రీనివాసరావు, కమిషనర్ టి.నాగేంద్రకుమార్ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మునిసిపల్ వైస్ చైర్మన్‌గా కిల్లాడి ప్రసాద్ తాడేపల్లిగూడెం : మునిసిపల్ వైస్ చైర్మన్‌గా 34వ వార్డు కౌన్సిలర్ కిల్లాడి ప్రసాద్ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవి కోసం ఒక నామినేషన్ మాత్రమే పడటంతో కిల్లాడిని ఏకగ్రీవంగా వైస్ చైర్మన్‌గా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ఏలూరు ఆర్డీవో నంబూరి తేజ్‌భరత్ ప్రకటించారు . -
గుర్తింపు కార్డులివ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం
కొవ్వూరు: కృష్ణా పుష్కరాలకు వచ్చే పురోహితులకు పూర్తిస్థాయిలో గుర్తింపుకార్డులివ్వడం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి ఎంఎల్ఎన్ శ్రీనివాస్ విమర్శించారు. కొవ్వూరులోని పట్టణ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు అనుపిండి చక్ర«దరరావు నివాసంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 12 వేల మంది గుర్తింపుగల పురోహితులుంటే ప్రభుత్వం 4 వేల మందికి మాత్రమే కార్డులు ఇస్తుందన్నారు. కొన్ని ఘాట్లలో మాత్రమే పురోహితులు విధులు నిర్వహించాలన్న నిబంధనలను హైకోర్టు సడలించిందన్నారు. విజయవాడలో హిందూ ఆలయాలు కూల్చిన చోట మరుగుదొడ్లు నిర్మించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పురోహితుల స్వాతంత్య్రాన్ని ప్రభుత్వం హరించాలని చూడడం, కొన్ని ఘాట్లకే పరిమితం చేయడం సరికాదని చక్రధరరావు అన్నారు. సంఘం కార్యదర్శి పిల్లలమర్రి మురళీకృష్ణ, కోశాధికారి హెచ్ఎస్ఎస్ జగన్నాథరావు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా గోదావరి
కొవ్వూరు : గోదావరిలో వరద నిలకడగా ఉంది. ఎగువ నుంచి వచ్చే ప్రవాహ జలాలు తగ్గిపోవడంతో వరద ఉధృతి తగ్గింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఉదయం ఆరు గంటలకు 9 అడుగులున్న నీటిమట్టం సాయంత్రం ఆరు గంటలకు పది అడుగులకు చేరింది. ఆనకట్టకి నాలుగు ఆర్మ్‌ల వద్ద ఉన్న 175 గేట్లను 0.60 మీటర్లు ఎత్తులేపి ఉదయం 3,45,540 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. సాయంత్రానికి ఇన్‌ఫ్లో కాస్త తగ్గడంతో 2,94,387 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 13,600 క్యూసెక్కుల నీటిని కాలువలకు విడిచిపెడుతున్నారు. దీనిలో జిల్లాలో పశ్చిమ కాలువకి 7వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద తగ్గడంతో కొవ్వూరు గోష్పాదక్షేత్రం స్నానఘట్టంలో మెట్లు బయటపడుతున్నాయి. -
గురజాడ తమ్ముడే బతికివుంటే...
స్మరణ విశాఖ మన్యంలో పొటమరించిన గిరిజనుల తిరుగుబాట్లను గురజాడ పట్టించుకోలేదనే విమర్శ ఉంది. అయితే, తన జీవిత కాలంలోనే కథాపురుషుడుగా ప్రసిద్ధికెక్కిన ఆదివాసి తాంతియా భిల్ వీరగాథల్లో ఒక సన్నివేశాన్ని గురజాడ అప్పారావు తమ్ముడు గురజాడ శ్యామలరావు మాత్రం ‘ద పోలీస్ అండ్ ద బార్బర్, యాన్ ఎపిసోడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తాంతియా ద భీల్’ శీర్షికతో చిన్న గేయ దృశ్య రూపకాన్ని ఐయాంబిక్ పెంటామీటర్ ఛందస్సులో రచించి, ఆనాటి సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు శంభుచంద్ర ముఖర్జీ ‘రీస్ అండ్ రైయత్’ పత్రికలో (అక్టోబర్ 26, 1889 సంచిక) ప్రచురించాడు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక 1889 నవంబరులో తాంతియా అరెస్టు వార్తను ప్రచురించి, అతణ్ణి ‘ఇండియన్ రాబిన్‌హుడ్’గా అభివర్ణించింది. తాంతియా బ్రిటిష్ సైన్యాన్నీ, హోల్కరు సంస్థానం సిపాయిలనూ ముప్పుతిప్పలు పెట్టాడు. అతను గెరిల్లా పోరాట పద్ధతుల్లో ఆరితేరిన యోధుడు. తాంతియాకు సహకరించారనే ఆరోపణ మోపి ప్రభుత్వం ఎందరినో జైల్లో పెట్టింది. చివరకు అతని రక్త సంబంధీకుల ద్రోహం వల్లే ప్రభుత్వం తాంతియాను బంధించగలిగింది. 1889 అక్టోబర్ 19న సెషన్స్ జడ్జీ తాంతియాకు మరణశిక్ష విధించాడు. పోలీసులు తాంతియా పార్థివ దేహాన్ని ఖాండ్వాకు వెళ్లే రైలుమార్గంలో పాతాల్పానీ అనే ప్రదేశంలో పడేశారని జనశృతి. తాంతియా ఒక పోలీసు జమేదారు నాసికను ఖండించినట్లు చరిత్ర. తన కోసం అరణ్యంలో గాలిస్తూ, ఎప్పుడు ఆకస్మికంగా విరుచుకుపడతాడో అని భిక్కుభిక్కుమంటున్న పోలీసుల దగ్గరకు తాంతియా ఒక పల్లెటూరి రైతు రూపంలో వస్తాడు. తాను మంగలిననీ, తాంతియా దోపిడి మూకకు భయపడుతున్నాననీ చెప్తాడు. పోలీసు జమేదారు తనకు గడ్డం చేయమంటాడు. వినయం నటిస్తూ గడ్డం చేస్తూ, అతని ముక్కు కోసి, తానే తాంతియానని చెప్పి అడవిలో అదృశ్యమవుతాడు. ఈ సంఘటనను బాలే రూపంలో చిత్రించి బ్రిటిష్ పోలీసులను ఎద్దేవా చేస్తాడు శ్యామలరావు. ఈ బాలేలో తాంతియా ధైర్యాన్ని కీర్తించడం కూడా ఉంది. శ్యామలరావు స్మృతికి నిదర్శనంగా ఈ గేయరూపకం, అప్పారావు శ్యామలరావుకు రాసిన ఒక ఉత్తరం, శంభుచంద్ర ముఖర్జీ ఈ గేయ రూపకాన్ని ప్రశంసిస్తూ శ్యామలరావుకు రాసిన సుదీర్ఘ లేఖ మాత్రమే మనకు మిగిలాయి(‘గురజాడలు’ పుటలు 1005, 1012; అనుబంధం: 61-63). గురజాడ అప్పారావు వారసుల కథనం ప్రకారం, శ్యామలరావు విజయనగరంలో బీఏ చదువుతూ ప్రిన్సిపాల్ రామానుజాచార్యుల బోధన నచ్చక మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడు. అక్కడ అతనికి ‘‘కాంగ్రెస్ గాలి సోకింది’’. దాంతో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభల్లో (1886) పాల్గొని విషయ నిర్ణయ సభలో ఒక తీర్మానం మీద పది నిమిషాలు ప్రసంగించాడు. మద్రాసులో జరిగిన మూడో కాంగ్రెస్ సభ (1887)లకు గూడా బి.ఎల్. విద్యార్థిగా హాజరయ్యాడు. ‘‘అవసరాల సూర్యారావిచ్చిపోయిన భోగట్టా విశ్వసనీయమైతే, బొంబాయిలో జరిగిన ఐదవ కాంగ్రెస్ (1889) సభల్లో గూడా శ్యామలరావు పాల్గొన్నాడనుకోవాలి.’’ అప్పటికే శ్యామలరావు రేడికల్ విద్యార్థిగా పేరుపడ్డాడు. మద్రాసులో జరిగిన మూడో కాంగ్రెస్ సభ (1887)ల్లో సుప్రసిద్ధ న్యాయవాది ఎడ్లీ నార్టన్ ఉపన్యసిస్తూ- శాసనసభల్లో ప్రజాప్రతినిధులకు ప్రవేశం కలిగించాలనడమే రాజ ద్రోహ చర్య అయ్యేట్లయితే- ... I am ranked as one among such a magnificient arry of seditionists అని ప్రకటించాడు. ఎడ్లీ ఉపన్యాసంలోని ఈ చివరి వాక్యాల స్ఫూర్తితో శ్యామలరావు To the magnificient Seditionists అనే గేయాన్ని రచించి, హిందూ పత్రికలో ప్రకటించాడు. ‘‘అంతకంటే ముఖ్యమైన సంగతి: సముద్రం ఒడ్డున మిత్రులతో కలిసి ముచ్చటిస్తున్న శ్యామలరావును ఎడ్లీ నార్టన్ వెదుక్కుంటూ వచ్చి కౌగిలించుకొనిగానీ వదల్లేదు’’. హిందూలో అచ్చయిన కవితను శ్యామలరావు శంభుచంద్ర ముఖర్జీకి పంపాడు. ముఖర్జీ తిరిగి శ్యామలరావుకు రాసిన ఉత్తరంలో పై కవితలోని తొలి నాలుగు చరణాలను ఉదహరించాడు. ఈ నాలుగు చరణాలే ప్రస్తుతం మనకు దక్కినవి. ఐ ్చఝ ్చటౌ్టజీటజ్ఛిఛీ ్చ్ట డౌఠట ఛిౌఝఝ్చఛీ ౌజ ఉజజీటజి అని శ్యామలరావును ముఖర్జీ ప్రశంసించారు. శ్యామలరావు, అతని కవి మిత్రుడు వంటి విద్యార్థులు కలకత్తా విశ్వవిద్యాలయంలో ఉంటే ఎంతో బాగుండేదని అభినందించారు. ‘‘మీరు రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరుకుంటాను. అది సాధ్యం కాదని తెలుసు. దిగజారుతున్న స్థానిక రాజకీయాలకు దూరంగా ఉండలేరనీ తెలుసు. ఏమైనా ఉన్నత విద్య మీద ప్రధానంగా దృష్టి పెట్టి, రాజకీయాలకు రెండో ప్రాధాన్యం ఇవ్వండి’’ అని సలహా కూడా ఇచ్చారు. గోమఠం శ్రీనివాసాచార్యులు తన ఇంగ్లీషు హరిశ్చంద్ర నాటకం చివర శ్యామలరావు స్మృతిచిహ్నంగా, అతను రాసిన రెండు బ్లాంక్ వెర్సెస్ని చేర్చుకొని, ఆ విషయాన్ని ఉపోద్ఘాతంలో పేర్కొన్నాడు. మొదటి పద్యంలో నారదుడు హరిశ్చంద్రుణ్ని ఆశీర్వదిస్తూ చెప్పిన అంశాలు, రెండో పద్యంలో హరిశ్చంద్రుడి సమాధానం ఉన్నాయి. ‘‘నా మిత్రులు కీర్తిశేషులు గురజాడ శ్యామలరావు బి.ఏ.గారు పన్నెండు సంవత్సరాల క్రితం రచించిన రెండు బ్లాంక్ పద్యాలను వారి జ్ఞాపక చిహ్నముగా వుంచుటకు యింతకంటె మార్గము లేదు గనుక యీ నాటకంలో అచ్చొత్తించాను’’ అని శ్రీనివాసాచార్యులు పేర్కొన్నారు. అవసరాల సూర్యారావు శ్రద్ధ వల్లే ఈ పద్యాలు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. గురజాడ శ్యామలరావు 1890-91లో లా చదువుతూ, జబ్బు చేసి, యవ్వనంలోనే చనిపోయినట్లు కె.వి.ఆర్. పరిశోధనలో తేలింది. అప్పటికి శ్యామలరావుకు పెళ్లి కూడా అయింది. ‘‘చచ్చిన వాని కళ్ళు చేరడేసి అని కాదుగాని, శ్యామలరావే బతికివుంటే అన్న తల దన్నిపోయినా, పోకున్నా సమవుజ్జీగానైనా రాణించి ఉండేవాడు’’(కె.వి.ఆర్. మహోదయం). డా॥కాళిదాసు పురుషోత్తం 9247564044 -
ఆ.. ఎలుకలే కదా!
కేవీఆర్‌లో పందికొక్కులు రెండు రోజుల్లో తొమ్మిదిమంది ఆసుపత్రిపాలు పాములు, ఎలుకలతోవిద్యార్థుల అవస్థలు హాస్టల్ చుట్టూఅపరిశుభ్ర వాతావరణం నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నఅధికారులు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కేవీఆర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ హాస్టల్ వసతి ఉండడంతో మహిళల విద్యాభ్యాసానికి అనుకూలంగా భావిస్తారు. ఇంటర్ నుంచి డిగ్రీ, పీజీ వరకు చదువుకునే వీలుంది. ఈ కారనంగా గ్రామీణ విద్యార్థినులు దాదాపుగా ఈ కళాశాలలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తారు. 2015-16 విద్యా సంవత్సరంలో 1,100 మంది విద్యార్థినులు ఈ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. అయితే హాస్టల్లో అధికారులు సరైన సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారు. ఎటు చూసినా అపరిశుభ్ర వాతావరణమే కనిపిస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో నాన్‌టీచింగ్ స్టాఫ్ ఇష్టారాజ్యం సాగుతోంది. అసలే హాస్టల్ భవనం పాతది కావడం.. దీనికి తోడు పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో ఎలుకలు, పందికొక్కులు, పాముల సంచారం అధికమైంది. ముఖ్యంగా ఎలుకల బెడద అధికమవడంతో విద్యార్థినులకు కంటి మీద కునుకు దూరమవుతోంది. మూడు రోజుల క్రితం ఎలుకలు కొరకడంతో 9 మంది విద్యార్థినులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నారు. బుధవారం 5గురు, గురువారం నలుగురు ఆసుపత్రిలోని అంటువ్యాధుల విభాగంలో చికిత్స పొందారు. వచ్చే నెలలో పరీక్షలు ప్రారంభమవుతున్న సమయంలో ఎలుకల సమస్యతో చదువుపై దృష్టి సారించలేని పరిస్థితికి కారణమవుతోంది. విధిలేని పరిస్థితుల్లో కొందరు విద్యార్థినులు ప్రిపరేషన్ హాలిడేస్ పేరిట సొంతూళ్లకు వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పరిస్థితిని అధికారులు తేలిగ్గా తీసుకుంటున్నారు. ఎలుకలు ఎవరిళ్లలో లేవంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. పైగా విద్యార్థినులే హాస్టల్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం లేదనే సాకులతో సరిపుచ్చుతున్నారు. గోడ కూలి ఏడాది హాస్టల్ భవనాల సమీపంలోని కేసీ కెనాల్ వైపున్న గోడ కూలి ఏడాది గడుస్తోంది. అయినా ఇప్పటి వరకు అధికారులు మరమ్మతులు చేయించేందుకు ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది. ఫలితంగా రాత్రిళ్లు బయటి వ్యక్తులు లోపలికి వస్తున్నారనే చర్చ జరుగుతోంది. హాస్టల్‌కు సమీపంలోనే సారా తయారీ ప్రాంతమైన బంగారుపేట ఉండటంతో మందుబాబుల సంచారం ఈ ప్రాంతంలో అధికంగా ఉంటోంది. అయినప్పటికీ విద్యార్థినుల భద్రతను అధికారులు గాలికొదిలేశారు. ఎవరింట్లో ఎలుకలు ఉండవు ఎలుకలు ఎవరింట్లో ఉండవు. అందరిండ్లలో ఉంటాయి. హాస్టల్లో కూడా అంతే. విద్యార్థినులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలేదు. అందువల్లే ఎలుకల సంచారం అధికమైంది. విద్యార్థినులను ఎలుకలు కరిచిన విషయం నా దృష్టికి రాలేదు - పురుషోత్తమరెడ్డి, ప్రిన్సిపాల్ -
రాజకీయ శత్రువులంతా గులాబీ గూటికే..
సాక్షి, హైదరాబాద్: అంతా తెలుగుదేశం పార్టీలో ఎదిగిన వారే! చిన్న వయసులోనే ఎమ్మెల్యే, మంత్రిగా పదవులు అనుభవించిన వారు కొందరైతే... టీడీపీలో ఉన్నన్ని రోజులు పదవులను అనుభవించిన వారు మరికొందరు. 2014 ఎన్నికల వరకు వీరందరిదీ పసుపు గూడే! దాదాపు 20 ఏళ్లకు పైగా కలిసి పనిచేసి, పార్టీలో అంతర్గతంగానే శత్రువులుగా మెదిలిన ఆ నాయకులు ఒక్కొక్కరుగా పార్టీ మారడం మొదలుపెట్టారు. 1994లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తలసాని శ్రీనివాస్ యాదవ్, జి. సాయన్నలు ఇప్పటికే టీఆర్ఎస్లో చేరారు. వీరితో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవిని అనుభవించి స్టాంపుల కుంభకోణంలో చిక్కుకొని 2003లో జైలుపాలైన సి. కృష్ణయాదవ్ సోమవారం టీఆర్ఎస్ జెండా పట్టుకోనున్నారు. అయితే 1994, 1999లో ఎమ్మెల్యేలుగా గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్, కృష్ణయాదవ్‌ల మధ్య మంత్రి పదవి కోసం పోటీ, తీవ్ర అభిప్రాయ భేదాలు ఉండేవి. హైదరాబాద్ నుంచే ఎన్నికైన ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరిద్ధరిలో ఎవరో ఒకరే మంత్రిగా ఉండే అవకాశం ఉండేది. ఇదే తలసాని, కృష్ణయాదవ్‌ల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలకు కారణమైంది. కృష్ణయాదవ్ జైలు నుంచి వచ్చిన తరువాత టీడీపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకునేందుకే తలసాని ప్రయత్నించారు. చివరికి కృష్ణయాదవ్ టీడీపీలోలో చేరినా ఆయనకు ప్రాధాన్యత కల్పించలేదు. అప్పటి వరకు హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న తలసాని టీఆర్ఎస్లో చేరిన వెంటనే కృష్ణయాదవ్‌కు ఆ పదవి లభించింది. కృష్ణయాదవ్ టీడీపీ అధ్యక్షుడిగా పనికిరాడంటూ చంద్రబాబుకు విన్నవించి ఆ పదవిని మాగంటి గోపీనాథ్‌కు కట్టబెట్టడంలో ప్రధాన పాత్ర పోషించిన కంటోన్మెంటు ఎమ్మెల్యే జి. సాయన్న కూడా ఇప్పటికే టీఆర్ఎస్లో చేరారు. వీరందరికన్నా సీనియర్ అయిన మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా ఈ ముగ్గురిలో ఒక్కొక్కరిని ఒక్కో విధంగా విభేదిస్తారు. వీరేకాకుండా ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన మాజీ సీబీఐ డెరైక్టర్ కె. విజయ రామారావుతో కూడా మాజీ టీడీపీ నేతలైన ప్రస్తుత టీఆర్ఎస్ నేతలకు పలు విషయాల్లో అభిప్రాయ బేధాలున్నాయి. 1999 నుంచి 2004 వరకు మంత్రిగా ఉన్న ఆయన పోలీస్ ఆఫీసర్‌గానే వ్యవహరిస్తూ మాస్ లీడర్లుగా ఉన్న తలసాని, కృష్ణయాదవ్‌ల తీరుపై పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీరంతా ఇప్పుడు గులాబీ గూటికి చేరడం భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలకు వేదికవుతుందో చూడాలి.