గోదావరివాసుల అప్యాయత ఎంతో ఇష్టం
కొవ్వూరు : గోదావరివాసులు అప్యాయత ఎంతో ఇష్టమని సినీనటి, టీవీ యాంకర్ ఝాన్సీ తెలిపారు. కొవ్వూరులో విక్టర్ సూపర్ బజార్ ప్రారంభోత్సవానికి శుక్రవారం వచ్చిన ఆమె విలేకర్లతో మాట్లాడారు. తాను ఇప్పటివరకు సుమారు 50 సినిమాలు, ఐదు వేలకు పైగా సీరియల్స్, టీవీ ప్రోగ్రాంలలో పాల్గొన్నట్టు చెప్పారు. మూడు వందల సినిమాల్లో నటించానని గౌతంరాజు తెలిపారు. తన కుమారుడు కృష్ణంరాజు హీరోగా 'లక్ష్మీదేవి సమర్పించే నేడే చూడండి' అనే సినిమా ఈ నెల 30న విడుదల కానున్నట్టు చెప్పారు. తనను ఆధారించినట్టే తన కొడుకు కృష్ణంరాజును ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.