పశ్చిమ డెల్టాకు 4,280 క్యూసెక్కులు
కొవ్వూరు : పశ్చిమ డెల్టా ఆయకట్టుకు సాగునీటి అవసరాల నిమిత్తం శనివారం 4,280 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు 8,240 క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు. దీనిలో తూర్పు డెల్టాకు 2,400, సెంట్రల్ డెల్టాకు 1,560 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. ఏలూరు కాలువకు 694, అత్తిలి కాలువకు 358, నరసాపురం కాలువకు 1,534, ఉండి కాలువకు 997, జీ అండ్ వీకి 489 క్యూసెక్కుల చొప్పున సాగునీరు అందిస్తున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 13.21 మీటర్లుగా నమోదైంది.