
కదం తొక్కిన చింతలపూడి రైతులు
చింతలపూడి : చింతలపూడి ఎత్తిపోతల పథ కం రైతులు గురువారం కదం తొక్కారు. రైతులకు న్యా యం జరిగే వరకు కాలువ తవ్వకం పనులు అడ్డుకోవాలని తీర్మానించారు. భూములు కోల్పోతున్న రైతులకు ఇచ్చే పరిహారం విషయంలో ప్రభుత్వం అవలం బిస్తున్న ద్వంద్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతలపూడి మార్కెట్ కమిటీ ఆవరణలో రైతుకూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నకూటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన భూ ములు కోల్పోతున్న జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులతో గురువారం ప్రజా చైతన్య సదస్సు నిర్వహించారు. సదస్సులో మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ మాట్లాడు తూ సాగునీటి ప్రాజెక్టుల్లో భూములు కోల్పోతున్న రైతులకు జిల్లా అంతా ఒకే తరహా నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఏడాది కాలంగా రైతులు ఇబ్బందులు పడుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉం టామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా చైత న్య సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమర్ మాట్లాడుతూ భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు నాలుగు రెట్ల పరిహారం అందించాలని కోరారు.