271 మంది కంప్యూటర్ టీచర్ల ఎంపిక
Published Fri, Oct 14 2016 12:12 AM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
ఏలూరు సిటీ : ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అందించేందుకు కంప్యూటర్ టీచర్ల నియామకానికి సంబంధించి ఎంపికలు గురువారం పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా 283 మంది కంప్యూటర్ టీచర్ల నియామకానికి ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించగా 1,256 మందికి పైగా అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఈ అభ్యర్థుల కంప్యూటర్ నిపుణత, సర్టిఫికెట్స్, నేటివిటీ ఆధారంగా ఎంపికలు పూర్తిచేసినట్టు జిల్లా విద్యాధికారి డి.మధుసూదనరావు తెలిపారు. 271 మంది అభ్యర్థులు కంప్యూటర్ టీచర్లుగా ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలు డీఈవో వెబ్‌సైట్‌లో పొందుపరిచామని తెలిపారు.
Advertisement
Advertisement