జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులు పెరుగుతున్న నేపద్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. భద్రతా బలగాలు కూడా రాష్ట్రంలో అణువణువునా తనిఖీలు చేపడుతున్నాయి. తాజాగా జమ్ముకశ్మీర్ పోలీసులు రాష్ట్రంలోని ప్రజలకు పలు సూచనలు చేశారు.
ఉగ్రవాదులు తరచూ దాడులకు తెగబడుతున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలోని ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అలాగే ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులుగానీ, వస్తువు గానీ కనిపిస్తే వెంటనే తమకు తెలియజేయాలని కోరారు.
అనుమానాస్పదుల ఎత్తు, వారు ధరించిన దుస్తులు, వారి దగ్గర ఏవైనా ఆయుధాలు కనిపిస్తే ఆ వివరాలు వెంటనే పోలీసులకు తెలియజేయాలని జమ్ము పోలీసు అధికారి అజయ్ శర్మ తెలిపారు. ఇటీవల కొందరు అనుమానాస్పద వ్యక్తులు స్థానికంగా ఉన్న ఓ బాలునికి కనిపించారని, ఈ విషయాన్ని ఆ బాలుడు సమీపంలోని సెక్యూరిటీ ఏజెన్సీకి తెలియజేశాడన్నారు. అయితే అది ఆ బాలుని ఊహ మాత్రమేనని, నాలుగు గంటలపాటు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఎవరి ఆచూకీ తెలియలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment