గణేష్ దీక్ష విరమణ చేస్తున్న భక్తులు
కాణిపాకం(ఐరాల):
గణేష్ దీక్షా మాలాధారణ చేసిన భక్తుల ఇరుముడి చెల్లింపులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. గురువారం ఒక రోజే∙సుమారు వంద మంది భక్తులు గణేష్ దీక్ష విరమణ చేశారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శివ కేశవులకు ఇరువురికి ప్రీతికరమైన మాసంలో గణేష్ దీక్షాధారణ చేస్తారు. వీరి కోసం ఆలయం తరపున ప్రత్యేక వసతి సౌకర్యాలను కల్పిస్తారు. స్వామివారి ఆలయం వద్ద శీఘ్రదర్శనం కలిగేలా చర్యలు చేపడతారు. వీరు ఇరుముడుల చెల్లింపు కోసం తాత్కాలికంగా ప్రత్యేక మండపాన్ని నిర్మించారు. గణేష్ దీక్ష మాలధారణ ఎక్కడైనా స్వీకరించి మండలం, అర్ధమండలం, ఏకాదశ, రోజుల్లో కాణిపాకంలో దీక్ష విరమణ చేయడం విశేషం. రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాలనుంచి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నది.