irumudi
-
శబరిమల ప్రవేశం : అపచారం.. అపచారం
శబరిమల : సాక్షాత్తు సుప్రీం కోర్టే అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ తీర్పు ఇచ్చినప్పటికి భక్తులు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. గత నెలలో శబరిమలలో పూజల సందర్భంగా.. నేడు జరిగే ప్రత్యేక పూజల సందర్భంగా స్వామి వారి దర్శనం కోసం మహిళలు వచ్చారు. కానీ 10 - 50 ఏళ్లలోపు బాలికలను, మహిళలను ఆలయంలోకి రాకుండా హిందూ సంఘాలు అడ్డుకుంటున్నాయి. ఈ క్రమంలో నేడు దాదాపు 200 మంది అయ్యప్ప భక్తులు గుంపుగా వెళ్లి ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ మహిళను అడ్డున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఒక అపరాధం చోటు చేసుకుంది. మహిళను అడ్డుకునేందుకు వెళ్లిన సదరు అయ్యప్ప భక్తుల గుంపుకు నాయకత్వం వహిస్తోన్న ఆర్ఎస్ఎస్ నాయకుడు వల్సన్ థిల్లంకెరి ఓ అపచారం చేశారు. అయ్యప్ప భక్తులు ఎంతో పవిత్రంగా భావించే బంగారు మెట్ల మీద వల్సన్ నిల్చున్నాడు. అయ్యప్ప దర్శనం చేసుకోవాలని భావించే భక్తులు ఎవరైనా సరే వయసుతో సంబంధం లేకుండా తల మీద ఇరుముడి కెట్టును ధరించాల్సి ఉంటుంది. అలా ఉన్న వారిని మాత్రమే బంగారు మెట్ల మీద నడిచి.. స్వామి వారిని దర్శించుకునేందుకు అనుమతిస్తారు. కానీ వల్సన్ సాధరణ వ్యక్తిలాగా శబరిమల వచ్చారు. కేవలం మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా చూడ్డం కోసమే వచ్చిన వల్సన్ ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న మహిళను అడ్డగించే క్రమంలో ‘ఇరుముడి కెట్టు’ లేకుండానే పవిత్ర బంగారు మెట్ల మీద నిల్చున్నాడు. అయితే మహిళలను అడ్డుకునే విషయంలో అత్యుత్సాహంగా ఉన్న భక్తులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. -
ఇదీ ఇరుముడిలోని రహస్యం
‘స్వామియే శరణం అయ్యప్పా!’ అని శరణుఘోష మిన్నంటుతుండగా, కుటుంబ సభ్యులు, బంధు, మిత్రులు వెంటరాగా... 40 రోజుల దీక్షని పూర్తి చేసిన సంతృప్తి కనులలో కదలాడుతుండగా, భక్తిభావం నిలువెల్లా ముంచెత్తుతుండగా... వేలాది భక్తులు గురుస్వామి చేత ఇరుముడి కట్టించుకుంటూ... కనిపిస్తుంటారు ఈ వారమంతా ఇంచుమించు అన్ని ఆలయాలలోనూ కనిపించే దృశ్యాలివే! ఇంతకూ ఇరుముడిలో ఏముంటుందో తెలుసా... ఇరు అంటే రెండు అని అర్థం. ఇరుముడి అంటే రెండు భాగాలు కలది అని చెప్పుకోవచ్చు. ఇరుముడిలో రెండు భాగాలు ఉంటాయి. ముందు భాగంలో పూజాసామాగ్రి, వెనుక భక్తునకు కావలసిన వస్తువులు, తినుబండారాలు ఉంటాయి. ముందు భాగంలో ఉండే ఆవునెయ్యి భక్తుని ఆత్మతో సమానం. కొబ్బరికాయ దేహంతో సమానం. అంటే భక్తులైనవారు ఆత్మతో సమానమైన నేతితో స్వామికి అభిషేకం చేసి (ఆత్మార్పణం గావించి) దేహం వంటి కొబ్బరికాయను స్వామి సన్నిధిలోగల హోమకుండంలో వేయాలి. కామ క్రోధాలను వీడి, కొబ్బరికాయలో ఉన్న మోహమనే నీళ్లను త్రోసి, జ్ఞానమనే నెయ్యిని పోసి, భక్తి నిష్ఠలనే ఇరుముడులను వేసి నలభై ఒక్కరోజులు స్వామి తలపులతోనే కఠినమైన జపం చేయాలి. అంటే శరీరం మీద మోహాన్ని విడిచి, మనశ్శరీరాలను భగవంతునికే అంకితం చేయాలని అర్థం. వెనుక భాగంలో ఉన్న తినుబండారాలు మానవుని ప్రార్దబ్ధకర్మలు. ఎవరి ప్రారబ్ధాన్ని వారే మోసుకొని పోవాలి, వారే అనుభవించాలి. -
గణేష్ దీక్ష భక్తులు ఇరుముడి చెల్లింపు
కాణిపాకం(ఐరాల): గణేష్ దీక్షా మాలాధారణ చేసిన భక్తుల ఇరుముడి చెల్లింపులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. గురువారం ఒక రోజే∙సుమారు వంద మంది భక్తులు గణేష్ దీక్ష విరమణ చేశారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శివ కేశవులకు ఇరువురికి ప్రీతికరమైన మాసంలో గణేష్ దీక్షాధారణ చేస్తారు. వీరి కోసం ఆలయం తరపున ప్రత్యేక వసతి సౌకర్యాలను కల్పిస్తారు. స్వామివారి ఆలయం వద్ద శీఘ్రదర్శనం కలిగేలా చర్యలు చేపడతారు. వీరు ఇరుముడుల చెల్లింపు కోసం తాత్కాలికంగా ప్రత్యేక మండపాన్ని నిర్మించారు. గణేష్ దీక్ష మాలధారణ ఎక్కడైనా స్వీకరించి మండలం, అర్ధమండలం, ఏకాదశ, రోజుల్లో కాణిపాకంలో దీక్ష విరమణ చేయడం విశేషం. రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాలనుంచి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నది. -
మీకు తెలుసా!
ఇరుముడిలో ఏముంటుంది? ఇరుముడిలో రెండు భాగాలు ఉంటాయి. ముందు భాగంలో పూజాసామగ్రి, వెనుకభాగంలో భక్తునికి కావలసిన వస్తువులు, తినుబండారాలు ఉంటాయి. ముందు భాగంలో ఉండే ఆవునెయ్యి భక్తుని ఆత్మతో, కొబ్బరికాయ దేహంతో సమానం. అంటే భక్తులైనవారు ఆత్మతో సమానమైన నేతితో స్వామికి అభిషేకం చేసి (ఆత్మార్పణం గావించి) దేహం వంటి కొబ్బరికాయను స్వామి సన్నిధిలోగల హోమకుండంలో వేయాలి. కామక్రోధాలను వీడి, కొబ్బరికాయలో ఉన్న మోహమనే నీళ్లను తీసేసి, జ్ఞానమనే నెయ్యి పోసి, భక్తి, నిష్ఠ అనే రెండు ముడులను (ఇరుముడి) వేసి 41 రోజులు స్వామి తలపులతోనే కఠినమైన జపం చేయాలి, శరీరం మీద మోహాన్ని విడిచి భగవంతునికే అంకితం చేయాలని అర్థం. వెనుకభాగంలో ఉన్న తినుబండారాలు మానవుని ప్రారబ్ధకర్మలు. ఎవరి ప్రారబ్ధాన్ని వారే మోసుకొనిపోవాలి, వారే అనుభవించాలి. స్వామి సన్నిధికి చేరుకొనే సరికి తినుబండారాలు అయిపోవాలి. అంటే స్వామి సన్నిధికి చేరుకున్న భక్తుడు ప్రారబ్ధకర్మను వదిలివేయాలని అర్థం. శఠగోపం ఎందుకు? ఎందుకు? శఠగోపం శిరస్సు మీద పెడతారు. దీనిపైన భగవంతుని పాదుకలు ఉంటాయి. దేవుని పాదాలను శిరసున ధరించాలి. భగవంతుని స్పర్శ శిరస్సుకు తగలడం అంటే భక్తులను అనుగ్రహించడం అని అర్థం. శఠగోపం పాదాల ఆకృతిలో ఉంటే మన తలను అవి పూర్తిగా తాకడానికి అనుకూలంగా ఉండవనే ఉద్దేశంతో వాటిని వలయాకారంగా తయారుచేసి పైన పాదాలు ఉండేలా తయారుచేశారని చెబుతారు. శఠత్వం అంటే మూర్ఖత్వం అని, గోపం అంటే దాచిపెట్టడం అని కూడా ఉంది. భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడనేది ఆధ్యాత్మికుల భావన. నేను, నాది అనే భ్రమను తొలగించడానికి శఠగోపం పెడతారు. శాస్త్రపరంగా చూస్తే... శఠగోపం పంచలోహాలతో కాని, ఇత్తడి, వెండి, రాగి, బంగారం, కంచులతో విడివిడిగా గాని తయారుచేస్తారు. వీటన్నిటికీ వేడిని సంగ్రహించే శక్తి ఉంది. అందుకే తలమీద పెట్టగానే తలలోని వేడిని ఇది సులువుగా లాగేస్తుంది. మంచిమాట కర్మ నడిచే విధానం చాలా కఠినమైనది. నేనేమీ చేయకుండా ఉన్నా, నన్నే సర్వానికి కారణభూతమని, అన్నింటికీ నేనే మూలమని చెబుతూ వాటన్నింటి ఫలాలూ నా నెత్తిన మోపుతుంటారు. అయితే అవన్నీ వాళ్ల కర్మకొద్దీ, అదృష్టం కొద్దీ లభిస్తుంటాయి. అవన్నీ అలా అనుభవించినా నేనే చేశానంటారు. చేసేవాణ్ణి నేను కాదు. నేను సాక్షీభూతుణ్ణి మాత్రమే. చేసేది కర్త, చేయించేవాడు పరమాత్మ. ఆ పరమాత్ముడే అన్నింటిలో నిండి వున్నాడు. - షిర్డిసాయిబాబా