తుంపర సేద్యం తప్పనిసరి | tumpara sedyam tappanisari | Sakshi
Sakshi News home page

తుంపర సేద్యం తప్పనిసరి

Published Fri, May 19 2017 12:25 AM | Last Updated on Tue, Sep 5 2017 11:27 AM

తుంపర సేద్యం తప్పనిసరి

తుంపర సేద్యం తప్పనిసరి

ఏలూరు (మెట్రో) : జిల్లాలో భూగర్భజలాలు అడుగంటుతున్న దృష్ట్యా ఉద్యాన పంటలకు తుంపర సేద్యం తప్పనిసరి అని, ఎవరైనా డ్రిప్‌ ఏర్పాటు చేయకుంటే చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు జాయింట్‌ కలెక్టర్‌ ఎంహెచ్‌ షరీఫ్‌ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లో తుంపర సేద్యంపై క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కరువు జిల్లాలుగా ప్రసిద్ధి చెందిన అనంతపురం జిల్లా కన్నా పశ్చిమగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో భూగర్భ జలాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మెట్ట ప్రాంతం వ్యవసాయానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని షరీఫ్‌ చెప్పారు. నీటి వనరులను సద్వినియోగం చేసుకుని తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించే తుంపర సేద్యాన్ని ఉద్యానవన పంటలకు తప్పనిసరి చేయాలని, లేకపోతే నీరులేక పంటలు దెబ్బతిని రైతులు ఆర్థికంగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 45 వేల హెక్టార్లలో బిందు సేద్యాన్ని అమలు చేసి ప్రతి ఎకరాలో డ్రిప్‌ ఏర్పాటు చేసి తీరాలి్సందేనని, ఈ లక్ష్యాన్ని అధిగవిుంచేందుకు రోజువారీ ప్రగతి నివేదికలను కలెక్టర్‌ భాస్కర్‌ సమీక్షిస్తున్నారని ఆయన చెప్పారు.  వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వై.సాయిలక్ష్మీశ్వరి మాట్లాడుతూ జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్ధికి నిర్మాణాత్మకమైన చర్యలు అమలు చేస్తున్నారన్నారు.  మైక్రో ఇరిగేషన్‌అధికారి రామ్మోహనరావు మాట్లాడుతూ జిల్లాలో మిగిలిన 45 వేల హెక్టార్లలో ఈ ఏడాది కచ్చితంగా బిందు సేద్యాన్ని అమలు చేసి రైతులకు సమకరిస్తామని చెప్పారు. ఉద్యాన శాఖ డెప్యూటీ డైరెక్టర్‌ వైవీఎస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ బిందుసేద్యం ద్వారా రైతులు 40 శాతం నుంచి 50 శాతం వరకూ విద్యుత్‌ ఆదా చేసుకోవచ్చన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement