బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో రెండో రోజు గురువారం విస్తారంగా వర్షాలు కురిశాయి. ఊరూవాడా అనే తేడా లేకుండా వర్షాలకు తడిసి ముద్దయ్యాయి. పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. పంట పొలాలు ముంపు బారినపడ్డాయి. పలు కాలనీలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి.
కొవ్వూరు : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షం కురిసింది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో గురువారం ఉదయం 8 గంటల వరకు 34.3 మి.మీటర్లు సరాసరి వర్షపాతం నమోదైంది. ఆచంట, జంగారెడ్డిగూడెం, ఉండ్రాజవరం మండలాల్లో భారీ వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో గురు, శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేప«థ్యంలో ఉదయం నుంచి జిల్లా అంతటా ఓ మోస్తారు వర్షం పడింది. కొన్ని మండలాల్లో భారీ వర్షం పడింది. చింతలపూడి, లిం గపాలె ం,తాడేపల్లిగూడెం మండలాల్లో చెదురుమదురు జల్లులు పడ్డాయి. ఉదయం నుంచి జల్లులతో కూడిన వర్షం కురుస్తుండడంతో జనజీవనం స్తంభించింది. మధ్యాహ్నం కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు మండలాల్లో భారీ వర్షం కురిసింది. రాత్రి కూడా జిల్లాలో కొన్ని మండలాల్లో జడివాన పడుతూనే ఉంది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆచంట మండలంలో గరిష్టంగా 68.0 మి.మీటర్లు నమోదు కాగా, లింగపాలెం మండలంలో 8.0 మి.మీటర్లు కురిసింది. గురువారం మధ్యాహ్నం జంగారెడ్డిగూడెంలో భారీ వర్షం పడింది. కామవరపు కోట, గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల, ద్వారకా తిరుమల, నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం, తణుకు, పెనుగొండ, ఆచంట, అత్తిలి, నరసాపురం, మొగల్తూరు మండలాల్లో ఓ మోస్తారు వర్షం పడింది. మిగిలిన మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి.
జిల్లాలో వర్షపాత వివరాలు
ఉండ్రాజవరంలో 61.4, జంగారెడ్డిగూడెంలో 60.4, తణుకు, దేవరపల్లిలో 57.8, నిడదవోలులో 57.2, పోడూరు 54.6, బుట్టాయిగూడెం 53.8, చింతలపూడిలో 53.4, తాడేపల్లిగూడెంలో 49.6, పెనుగొండలో 45.4, కామవరపుకోట 39.2, మొగల్తూరులో 36.8, వేలేరుపాడులో 36.8, కొవ్వూరులో 36.0, కొయ్యలగూడెం, ఉంగుటూరులో 35.4, వీరవాసరం 34.2, ఆకివీడులో 24.0, తాళ్లపూడి పెనుమంట్రలో 23.6, పెదపాడులో 23.2, నిడమర్రులో 23.0, పెదవేగిలో 20.4, ఏలూరు, దెందులూరులో 18.2, యలమంచిలిలో 15.4, నరసాపురంలో 13.2 మి.మీటర్లు వర్షపాతం నమోదైంది.