దొంగ దొరికాడు
Published Thu, Mar 30 2017 7:50 PM | Last Updated on Thu, Sep 27 2018 5:25 PM
జంగారెడ్డిగూడెం: చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసినట్టు ఎస్సై ఎం.కేశవరావు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. తెలంగాణ రాష్ట్రం దమ్మపేటకు చెందిన ఇంగోలి రమేష్ పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్లలో అతనిపై కేసులు ఉన్నాయి. ఇటీవల స్థానిక గరుడపక్షినగర్‌లోని ఓ ఇంట్లో వెండి వస్తువులు, హోం థియేటర్‌కు సంబంధించిన పరికరాలు చోరీ చేశారు. ఆయా కేసుల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం స్థానిక వారపు సంత సమీపంలో రమేష్‌ను అరెస్ట్ చేసి 250 గ్రాముల వెండి వస్తువులు, హోం థియేటర్ పరికరాలు రికవరీ చేశారు. అతడిని జంగారెడ్డిగూడెం కోర్టులో హాజరుపరిచినట్టు చెప్పారు.
Advertisement
Advertisement