సోలార్ విద్యుత్‌కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన
Published Thu, Aug 4 2016 10:50 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
గొల్లగూడెం(ఉంగుటూరు) : ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో నిర్మితమవుతున్న ఐదు మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాన్ని గురువారం ఎపీ జెన్‌కో డైరెక్టర్ సి.హెచ్.నాగేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్ కె.రత్నబాబు సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలని, రాజీ పడవద్దని సూచించారు. ప్రాజెక్టు నిర్మాణం మ్యాప్‌ను చూపించి పనుల గురించి ఈఈ కొలగాని మూర్తి అధికారులకు వివరించారు. వారు స్పందిస్తూ.. దీనిని మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దుతామని, నిర్మాణం పూర్తయితే రాష్ట్ర గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామని, పర్యాటక కేంద్రంగానూ తీర్చిదిద్దుతామని, పోలవరం, తాడిపూడి కాలువల మధ్య నిర్మించటం విశేషమన్నారు. కేంద్రం ఆవరణలో మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఈలు సత్యనారాయణరెడ్డి, హరిశ్చంద్ర ప్రసాద్, ఏఈఈలు కోటేశ్వరరావు, శ్రీరామ కుమార్, ఎం.రామకృష్ణ, గంగయ్య కంపెనీ ప్రతినిధులు శ్రీనివాస్, శ్రీనివాసరెడ్డి, కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కాంట్రాక్టర్లతో అధికారులు సమావేశమయ్యారు. ప్రాజెక్టు ఆవశ్యకత గురించి వారికి వివరించారు.
Advertisement
Advertisement