విద్యారంగంలో జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలి
విద్యారంగంలో జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలి
Published Fri, Jun 9 2017 7:32 PM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జిల్లాలో విద్యారంగాన్ని పటిష్టం చేసి రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలపడానికి డీఈఓ కృషి చేయాలని ఎమ్మెల్సీ రాము సూర్యారావు కోరారు. డీఈఓ ఆర్‌ఎస్ గంగాభవానీకి రాష్ట్రస్థాయి అవార్డు లభించిన సందర్భంగా శుక్రవారం ఆయన జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో గంగాభవానీని కలసి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విద్యా ప్రమాణాలతో కూడిన కార్యక్రమాలు నిర్వహించి జిల్లాకు కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యాశాఖ ఏడీ ఏవీ వెంకటరమణ, సూపరింటెండెంట్‌లు పురుషోత్తం, అజీజ్, రీజనల్ స్పోర్ట్స్ కో– ఆర్డినేటర్ పీఎస్ సుధాకర్, పాండు రంగారావు, డి.శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement