ఘనంగా యూటీఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం | celebrate uti foundation day | Sakshi
Sakshi News home page

ఘనంగా యూటీఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం

Published Fri, Aug 12 2016 10:05 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

celebrate uti foundation day

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (యూటీఎఫ్‌) 17వ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం స్థానిక యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి షేక్‌ సాబ్జీ యూటీఎఫ్‌ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ  జాతీయ స్థాయిలో విద్యా ప్రైవేటీకరణకు, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా యూటీఎఫ్‌ ఎన్నో ఉద్యమాలు నిర్వహించిందన్నారు. విద్యాహక్కు చట్టం కోసం పోరాటాలు పార్లమెంట్‌లో చట్టం ఆమోదించేలా కృషి చేసిందన్నారు.
విద్యాహక్కు చట్టం అమలుకు జాతీయస్థాయిలో కేంద్ర బడ్జెట్‌లో 10 శాతం, రాష్ట్రస్థాయిలో 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ రద్దు కోసం దేశవ్యాప్తంగా కోటి సంతకాలను సేకరించి ప్రధానమంత్రికి అందిస్తామని, ఈ మేరకు నవంబర్‌ 29న చలో పార్లమెంట్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పీవీ నరసింహరావు, అసోసియేట్‌ అధ్యక్షులు వి.కనకదుర్గ, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ జీవీ. సూరపరాజు, రాష్ట్ర కౌన్సిలర్‌ ఎస్‌ఎస్‌.  బేగం బీబీ, నగర నాయకులు కెవీ. అప్పారావు, జీ.సాయిశ్రీనివాస్, స్వర్ణలత, రూరల్‌ మండల నాయకులు నంబూరి రాంబాబు, డి.లింగేశ్వరరావు, మాణిక్యాలరావు పాల్గొన్నారు.
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement