జిల్లా ఎన్జీవో ఎన్నికల షెడ్యూల్ విడుదల
Published Sat, Nov 12 2016 12:34 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM
ఏలూరు (మెట్రో) : జిల్లా ఎన్జీవో ఎన్నికల షెడ్యూల్‌ను తూర్పు, కృష్ణా జిల్లాలకు చెందిన ఎన్జీవో నాయకులు, జిల్లా ఎన్జీవో ఎన్నికల అధికారి ఉల్లి కృష్ణ శుక్రవారం విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 25న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి ఇలా 15 పోస్టులతో కూడిన జిల్లా కమిటీకి సంబంధించి 25వ తేదీ మధ్యాహ్నం నామినేషన్ల స్వీకరణ, పరిశీలన చేస్తారు. అనంతరం జాబితాను విడుదల చేస్తారు. నామినేషన్లు అధికంగా వస్తే 26వ తేదీ వరకూ ఉపసంహరణకు అవకాశం ఇచ్చి 26న తుదిజాబితా ప్రకటిస్తారు. ఒక్కో పోస్టుకు ఒక్కో నామినేష¯ŒS వస్తే 25నే నూతన జిల్లా ఎన్జీవో కమిటీని ప్రకటిస్తారు. నామినేషన్లు అధికంగా వస్తే డిసెంబర్ 4న మధ్యాహ్నం వరకూ ఎన్నికలు నిర్వహించి అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు. జిల్లాలోని 15 తాలూకాలకు చెందిన 277 మంది ఈ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
రేసులో రెవెన్యూశాఖ : జిల్లా ఎన్జీవో అధ్యక్ష పదవి కోసం జిల్లా రెవెన్యూ శాఖ తీవ్రంగానే ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఆ శాఖ తమ నుంచి ఏలూరు ఎన్జీవో తాలూకా కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కె.రమేష్‌కుమార్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. అదే విధంగా పే అండ్ అకౌంట్స్, ఇరిగేష¯ŒS శాఖల నుంచి హరనాథ్, చోడగిరి శ్రీనివాసరావు కూడా అధ్యక్ష పదవి కోసం రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి.
Advertisement