officer told
-
జిల్లాలో నగదు రహిత మందుల షాపులు
ఏలూరు అర్బన్ : జిల్లావాసులకు నగదు రహితంగా అన్ని ఔషధాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ (ఏడీసీ) వి.విజయశేఖర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాల మేరకు నగదు లేని కారణంగా రోగులు మందుల కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు పడకూడదని ఈ పోస్, ఎం పోస్ మెషిన్ లు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అన్ని అటాచ్డ్, చైన్ మందుల దుకాణాల్లో నగదు రహిత విధానంలో ఔషధాలు అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలోని అన్ని మందుల దుకాణాల్లో నగదు రహిత లావాదేవీల కోసం మందుల షాపుల యజమానులతో సంబంధిత బ్యాంకుల్లో స్వైపింగ్ మెషిన్ల కోసం దరఖాస్తు చేయించినట్టు చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 55 సాధారణ, రిటైల్ దుకాణాల్లో మెషిన్ లు అందుబాటులో ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో రోగులకు మందులు నగదు రహితంగా సులభంగా అందించేందుకు యుఎస్ఎస్డీ, యూపీఐ, ఈ పోస్ అనే మూడు విధానాలను దుకాణాల్లో అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. దీని వల్ల మందులు అవసరమైన వారు బ్యాంకు ఖాతా కలిగి సాధారణ మొబైల్ ఫోన్ ఉంటే నగదు లేకుండానే అవసరమైన అన్ని మందులు కొనుగోలు చేసేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు. ఈ మేరకు అన్ని దుకాణాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనువుగా ప్ల కార్డులు ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకున్నామని ఏడీసీ తెలిపారు. -
1,150 కిలోమీటర్ల మేర ఐవోసీ పైప్‌లై న్
జంగారెడ్డిగూడెం : ఒడిసాలోని పారాదీప్ ఆయిల్ శుద్ధి కర్మాగారం నుంచి హైదరాబాద్ వరకు 1,150 కిలోమీటర్లు ఆయి ల్ పైప్‌లై న్ వేయనున్నట్టు పైప్‌లై న్ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వ అధీకృత అధికారి కె.అనిల్జెన్సీసన్ తెలిపారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఈ పైప్‌లైన్‌ను సుమారు రూ.2 వేల కోట్లతో వేయనుందన్నారు. పైప్‌లైన్ రాష్ట్రం లో 675 కిలోమీటర్ల మేర ఉంటుందని, జిల్లాలోని 10 మండలాల మీ దుగా పైప్‌లైన్ వెళుతుందని చెప్పారు. 2019 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్‌లో ప్రత్యేక ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటుచేస్తామన్నారు. పైప్‌లైన్‌కు ప్రాథమిక సర్వే పూర్తయిందని చెప్పారు. 18 మీటర్ల వెడల్పు, మీటరున్నర లోతులో పైప్‌లైన్ ఉంటుందన్నారు. సమావేశంలో ఐవోసీ చీఫ్ కనస్ట్రక్షన్స్ మేనేజర్ బీవీఎస్ ప్రసాద్, సైట్ ఇంజనీర్లు విశ్వతేజ, చైత్ర తహసీల్దార్ జీవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. -
96 శాతం పంటకోత ప్రయోగాలు పూర్తి
వసంతవాడ (పెదపాడు): ప్రధానమంత్రి ఫసలీ బీమా ఫదకంలో భాగంగా జిల్లాలో 2,626 పంటకోత ప్రయోగాలకు గాను 2,521 ప్రయోగాలు నిర్వహించినట్టు ముఖ్య ప్రణాళిక అధికారి, జాయింట్ డైరెక్టర్ ఎం.బాలకృష్ణ తెలిపారు. బుధవారం పెదపాడు మండలంలోని వసంతవాడ గ్రామంలో పంటకోత ప్రయోగాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంటకోత ప్రయోగాలను పారదర్శకంగా నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో వివరాలు అందిస్తున్నామన్నారు. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని, పంట కోత ప్రయోగాల ఆధారంగానే రైతులు బీమా చెల్లిస్తారని చెప్పారు. జిల్లా ఉపసంచాలకుడు టి.సురేష్‌కుమార్, మండల సహాయ గణాంక అధికారి కె.గాంధీ వీఆర్వో సత్యనారాయణ ఆయన వెంట ఉన్నారు. -
భూగర్భ జలాల అభివృద్ధికి నిధులు
ఏలూరు (మెట్రో): రాష్ట్రంలో అడుగంటుతున్న భూగర్భ జలాలను అభివృద్ధి చేసేందుకు రూ.1,500 కోట్లతో 1.24 లక్షల బోరుబావులు నిర్మించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని రాష్ట్ర భూగర్భజల శాఖ డైరెక్టర్ కె.వేణుగోపాల్ చెప్పారు. పట్టణంలోని భూగర్భజల శాఖ కార్యాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. జిల్లాలో భూగర్భజలాల పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇటీవల కాలంలో భూగర్భజలాల వాడకం బాగా పెరిగిందని సమృద్ధిగా ఉండే జిల్లాలో కూడా భూగర్భజలాలు తగ్గుముఖం పట్టడం ప్రమాదకర పరిణామమని ఆయన చెప్పారు. గత మే నెలలో 19.08 మీటర్ల లోతులో ఉన్న భూగర్భజలాలు వర్షాలు, పోలవరం కుడి కాలువ తదితర అంశాల వల్ల ప్రస్తుతం 17.01 మీటర్ల లోతులో ఉన్నాయన్నారు. ఆరునెలలతో పోలిస్తే 2 మీటర్లు భూగర్భజలాలు పెరిగినా గత నెలతో పోలిస్తే 0.53 మీటరు నీరు తగ్గిందన్నారు. రాష్ట్రంలో 1.24 లక్షల బోరు బావులు నిర్మిస్తే అదనంగా 10 లక్షల ఎకరాలకు సేద్యపు నీరు అందుబాటులోకి తీసుకురాగాలని చెప్పారు. జిల్లాలో వినూత్న కార్యక్రమం కలెక్టర్ కాటంనేని భాస్కర్ ముందు చూపువల్ల రాష్ట్రంలోనే ప్రప్రథమంగా గోదావరి జలాలను భూగర్భంలోకి మళ్లించే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వేణుగోపాల్ చెప్పారు. పెదవేగి మండలం జానంపేట సమీపంలోని జగన్నాథపురంలో రైతుల సహకారంతో భూగర్భ జలాలను పెంపొందించడానికి ప్రయోగాత్మకమైన కృషి ఫలిచిందనన్నారు. త్వరలోనే 15 బోర్లు ద్వారా గోదావరి జలాలను భూగర్భంలో భద్రపరుస్తామన్నారు. జగన్నాథపురం గ్రామంలో చిలకలపూడి నరేంద్ర అనే రైతు భూమిలో కోడూరు చెరువు ద్వారా పట్టిసీమ నీటిని మళ్లిచి ఆదర్శ రైతు పర్వతనేని బాబ్జి ఇంజక్షన్ బావికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ బావిని తాము పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశామన్నారు. భూగర్భ జలశాఖ ఉపసంచాలకుడు శ్రీనివాసరావు, జిల్లా ఉపసంచాలకుడు రంగారావు పాల్గొన్నారు. -
జిల్లా ఎన్జీవో ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఏలూరు (మెట్రో) : జిల్లా ఎన్జీవో ఎన్నికల షెడ్యూల్‌ను తూర్పు, కృష్ణా జిల్లాలకు చెందిన ఎన్జీవో నాయకులు, జిల్లా ఎన్జీవో ఎన్నికల అధికారి ఉల్లి కృష్ణ శుక్రవారం విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 25న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి ఇలా 15 పోస్టులతో కూడిన జిల్లా కమిటీకి సంబంధించి 25వ తేదీ మధ్యాహ్నం నామినేషన్ల స్వీకరణ, పరిశీలన చేస్తారు. అనంతరం జాబితాను విడుదల చేస్తారు. నామినేషన్లు అధికంగా వస్తే 26వ తేదీ వరకూ ఉపసంహరణకు అవకాశం ఇచ్చి 26న తుదిజాబితా ప్రకటిస్తారు. ఒక్కో పోస్టుకు ఒక్కో నామినేష¯ŒS వస్తే 25నే నూతన జిల్లా ఎన్జీవో కమిటీని ప్రకటిస్తారు. నామినేషన్లు అధికంగా వస్తే డిసెంబర్ 4న మధ్యాహ్నం వరకూ ఎన్నికలు నిర్వహించి అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు. జిల్లాలోని 15 తాలూకాలకు చెందిన 277 మంది ఈ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రేసులో రెవెన్యూశాఖ : జిల్లా ఎన్జీవో అధ్యక్ష పదవి కోసం జిల్లా రెవెన్యూ శాఖ తీవ్రంగానే ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఆ శాఖ తమ నుంచి ఏలూరు ఎన్జీవో తాలూకా కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కె.రమేష్‌కుమార్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. అదే విధంగా పే అండ్ అకౌంట్స్, ఇరిగేష¯ŒS శాఖల నుంచి హరనాథ్, చోడగిరి శ్రీనివాసరావు కూడా అధ్యక్ష పదవి కోసం రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. -
ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు (మెట్రో) : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భాగంగా జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు (వికలాంగులు) అయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ మరో 10 బీసీ ఫెడరేషన్ల లబ్ధిదారులకు సంబంధిత కార్పొరేషన్ల ద్వారా వివిధ స్వయం ఉపాధి పథకాలు మంజూరు చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వి.ప్రసాదరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 18 నాటికి ఆన్లైన్లో సంబంధిత పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆయా సంస్థల్లో వికలాంగులకు 3 నుంచి 10 శాతం మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. అభ్యర్థులు 21 సంవత్సరాల వయసు నుంచి 50 సంవత్సరాల వయసు మధ్యలో ఉండాలని, తెల్లరేషన్ కార్డు కలిగి, కనీసం చదవడం, రాయడం తెలిసిన వారై ఉండాలన్నారు. దగ్గరలోని నెట్ సెంటర్లోగాని, మీ సేవా కేంద్రంలో కానీ ఎపిఒబిఎంఎంఎస్.సిజిజి.జిఒవి.ఇన్ అనే వెబ్సైట్లో తమ పేరు నమోదు చేసుకోవాలని ప్రసాదరావు తెలిపారు. -
జిల్లాలో నాలుగు గ్రీన్‌ఫీల్డ్ స్టేడియాల నిర్మాణం
ఏలూరు రూరల్ : జిల్లాలో 4 గ్రీన్ ఫీల్డ్స్ ఇండోర్ స్టేడియంల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్ఏ అజీజ్ చెప్పారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ భీమడోలు (జెడ్పీహెచ్ఎస్ స్కూల్), తాడేపల్లిగూడెం (ఎయిర్పోర్ట్ స్థలం), తణుకు (జెడ్పీహెచ్ఎస్), మొగల్తూరు (జెడ్పీహెచ్ఎస్) పాఠశాల ఆవరణలను ఎంపిక చేశామన్నారు. ఈ ప్రాంతాల్లో అనువైన స్థలం ఉన్నందునే అధికారులు నాలుగు సెంటర్లను ఎంపిక చేశారన్నారు. ఇందులో 25 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పుతో 9 మీటర్ల ఎత్తున మల్టీపర్పస్ అవసరాల కోసం ఇండోర్ స్టేడియంలు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఒక్కో స్టేడియం నిర్మాణానికి రూ. 2.50 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఖర్చు చేస్తారన్నారు. జూలై రెండోవారంలో ఈ ప్రాంతాలను శాప్ అధికారులు పరిశీలించి వెళ్లారన్నారు. నిరుద్యోగ పీడీ, పీఈటీలతో శిక్షణ ఉద్యోగం లేని ఫిజికల్ డైరెక్టర్లు(పీడీ) వ్యాయామ ఉపాధ్యాయ (పీఈటీ)లను గ్రామాల్లో క్రీడా శిక్షకులుగా నియమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుందని అజీజ్ చెప్పారు. ఉత్సాహం, ఆసక్తి గల వారు జిల్లా క్రీడాప్రాధికార సంస్థకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం 98663 17326 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
రూ.83.52 లక్షల ఎరువులు, పురుగుమందుల సీజ్
నిడమర్రు: జిల్లాలో రూ.83.52 లక్షల విలువైన పురుగుమందులు, ఎరువులను సీజ్ చేసినట్టు రాష్ట్ర తనిఖీ బృందం కో–ఆర్డినేటర్, శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఉపసంచాలకుడు పి.శివప్రసాద్ తెలిపారు. శుక్రవారం నిడమర్రు మండలంలోని పలు ఎరువులు, పురుగుమందుల దుకాణాలను రాష్ట్ర బృందం తనిఖీ చేసింది. దుకాణాల్లో ఇటీవల తగ్గించిన ధరలకు అమ్మకాలు జరుగుతున్నాయా? బిల్లులపై రైతుల సంతకాలు ఉన్నాయా అనే విషయాలను బృందం పరిశీలించింది. అనంతరం శివప్రసాద్ మాట్లాడుతూ.. ఈనెల 1 నుంచి శుక్రవారం వరుకూ 14 మండలాల్లో తనఖీలు చేపట్టామని, నిబంధనలకు విరుద్ధంగా 19 దుకాణాల్లో ఉన్న రూ.75లక్షల విలువైన ఎరువులు, నాలుగు దుకాణాల్లో ఉన్న రూ.8.42 లక్షల విలువైన పురుగు మందులను సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ బృదంలో ఏడీఏ ఆర్.శ్రీనివాసరావు, విత్తన పరిశోధన అధికారి వి.ఎల్.కె.వర్మ, ఏవో పి.భాస్కరరావు ఉన్నారు.