కొనసాగుతున్న ఉపాధ్యాయులదీక్షలు
కొనసాగుతున్న ఉపాధ్యాయులదీక్షలు
Published Sun, Sep 4 2016 10:54 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM
ఏలూరు సిటీ : ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన దీక్షలు రెండో రోజు ఆదివారం కొనసాగాయి. దీక్షా శిబిరాన్ని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి వీబీవీఎస్ సుబ్రహ్మణ్యం, ఏపీటీఎఫ్ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి గుగ్గులోతు కృష్ణ ప్రారంభించారు. దీక్షలకు మద్దతుగా ఎమ్మెల్సీ రాము సూర్యారావు, జేఏసీ చైర్మన్ ఎల్.విద్యాసాగర్, ఎన్‌జీవో జిల్లా కార్యదర్శి కె.హరినాథ్, ఐలూ నాయకులు కె.సత్యనారాయణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖాధికారి ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించి విద్యాశాఖలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళనలో భాగస్వామి అవుతానని హెచ్చరించారు. విద్యాసాగర్ మాట్లాడుతూ సోమవారం ఉపాధ్యాయులతో పాటు ఉద్యోగ సంఘాల నాయకులు కూడా దీక్షల్లో పాల్గొంటారని చెప్పారు. రెండో రోజు దీక్షల్లో పి.ఆంజనేయులు, ఎం.పోతురాజు, ఎన్.శ్రీనివాసరావు, ఎం.రామకృష్ణ, వి.కనకదుర్గ, కె.శ్రీదేవి, బి.సుభాషిణి, జీఎంఎన్ పద్మజ, డి.పూర్ణశ్రీ, డి.పద్మావతి, ఎస్‌కే బాబావలి, ఎం.జయరాజు, బీజేపీ పుష్పరాజు, జీవీ రంగమోహన్, టీఆర్ రవికుమార్, కె.సత్యనారాయణ, ఎస్.సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
Advertisement