సీపీవోలపై దాడులు చేస్తే కఠిన చర్యలు
ఏలూరు అర్బన్ : కమ్యూనిటీ పోలీస్ అధికారుల (సీపీవో)పై దాడులు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ హెచ్చరించారు. మంగళవారం ఎస్పీ భాస్కర్‌భూషణ్ స్థానిక అమీనాపేటలో ఉన్న సురేష్ బహుగుణ స్కూల్ ఆవరణలో ఉన్న కల్యాణ మండపంలో సీపీవోలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీపీవోల సేవలను కొనియాడారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వారు పోలీసులతో పాటు సమాజసేవలో పాటు పడుతున్నారని అందుకు ప్రతిఫలంగా వారి సేవల ప్రాతిపదికన ఏటా బెస్ట్ సీపీవోలను ఎంపిక చేసి ప్రోత్సాహకాలను అందిస్తామని, బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. ఏఎస్పీ వలిశల రత్న, ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు పాల్గొన్నారు.