Published
Sat, Sep 24 2016 11:44 PM
| Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
తమ్మిలేరును అభివృద్ధి చేయండి
ఏలూరు (మెట్రో) : తమ్మిలేరులో గుర్రపుడెక్క, తూడు తొలగించి తమ్మిలేరును అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాల వద్ద తమ్మిలేరును ఆయన పరిశీలించారు. తమ్మిలేరులో గుర్రపుడెక్క, తూడు తొలగించే పనులను పరిశీలించారు. తమ్మిలేరు వల్ల గతంలో ఏలూరు ముంపునకు గురైన పరిస్థితుల దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా తమ్మిలేరును వెడల్పు చేసి నీరు సక్రమంగా పారుదల జరిగేలా చూడాలని ఆదేశించారు. తమ్మిలేరు మురికి కూపంగా కాకుండా సేద్యపు నీటిని అందించే ఒక ప్రధాన కాలువగా తీర్చిదిద్దాలని దీని కోసం ఎన్ని నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి ప్రకటించారు. సురేష్ చంద్ర బహుగుణ పేరిట నిర్వహిస్తున్న పోలీస్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల అభివృద్ధికి రూ. 25 లక్షలు తక్షణ గ్రాంటుగా ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.