ఉపాధ్యాయులకు సత్వరమే రుణాలివ్వాలి | givinging loans to teachers as early | Sakshi

ఉపాధ్యాయులకు సత్వరమే రుణాలివ్వాలి

Aug 24 2016 11:04 PM | Updated on Sep 4 2017 10:43 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట): ఆర్థికావసరాల నిమిత్తం ప్రావిడెంట్‌ ఫండ్‌లో దాచుకున్న మొత్తానికి సంబంధించి ఉపాధ్యాయులకు రుణాలు మం జూరు చేయాలని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాము సూర్యారావు కో రారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట): ఆర్థికావసరాల నిమిత్తం ప్రావిడెంట్‌ ఫండ్‌లో దాచుకున్న మొత్తానికి సంబంధించి ఉపాధ్యాయులకు రుణాలు మం జూరు చేయాలని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాము సూర్యారావు కో రారు. జిల్లా పరిషత్‌ పీఎఫ్‌ రుణాల మం జూరులో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ యూటీఎఫ్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా రెండో రోజు బుధవారం నిరాహార దీక్షను ఆయన ప్రారంభించారు. సకాలంలో రు ణాలు మంజూరు చేయకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించిన జేఏసీ చైర్మన్‌ ఎల్‌వీ సాగర్‌ మాట్లాడుతూ రుణాలు మం జూరులో వివక్షత చూపుతున్న సూపరింటెండెంట్‌ను విధుల నుంచి తొలగించి పీఎఫ్‌ రుణాల మంజూరులో ప్రక్షాళన తీసుకురావాలని డి మాండ్‌ చేశారు. సంబంధిత సూపరింటెండెంట్‌ను బాధ్యతల నుంచి తొలగించినట్టు, రుణా లు మంజూరుకు ఆదేశాలు ఇచ్చామని మధ్యాహ్నం జరిగిన చర ్చల్లో జెడ్పీ సీఈవో డి.సత్యనారాయణ తెలిపారన్నారు. ఎమ్మెల్సీ ఆర్‌ఎస్‌ఆర్, ఎన్‌జీవో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రామకృ ష్ణ, యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి షేక్‌ సాబ్జీ, జిల్లా గౌరవాధ్యక్షులు ఎం.రామకృష్ణ, పి.జయకర్, పీవీ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement