5 నుంచి పీడీఎస్‌యూ మహాసభలు
Published Wed, Nov 2 2016 11:49 PM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట): ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) జిల్లా 14వ మహాసభలు ఈనెల 5,6 తేదీల్లో నిర్వహించనున్నామని సంఘ అధ్యక్షుడు ఈ.భూషణం తెలిపారు. బుధవారం స్థానిక సంఘ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పీడీఎస్‌యూకు గణనీయమైన చరిత్ర ఉందని, పట్టణ, మండల స్థాయి నాయకులు దీనిని కొనసాగిస్తూ విద్యార్థులతో మమేకమై విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రధాన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు
Advertisement
Advertisement