రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలకు శంకరాస్ విద్యార్థులు
రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలకు శంకరాస్ విద్యార్థులు
Published Fri, Jan 27 2017 11:44 PM | Last Updated on Wed, Sep 18 2019 3:24 PM
కర్నూలు సిటీ: రాయలసీమ యూనివర్సిటీ స్థాయిలో నిర్వహించిన యువజనోత్సవాల్లో శంకరాస్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి ఉత్సవాలకు ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను ఆ కాలేజీ డైరెక్టర్ డాక్టర హరికిషన్, ప్రిన్సిపాల్ శ్రీనివాసులు శుక్రవారం కళాశాలలో అభినందించి మాట్లాడారు. క్విజ్ పోటీలలో వెంకటరమణ, రూపేష్ , సోలోసాంగ్ పోటీలలో శ్రావణి విజేతలుగా నిలిచారన్నారు. వీరు ఈ నెల 30 వ తేదీన రాజమహేంద్రవరంలో జరిగే రాష్ట్ర స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ పీఓ మద్దిలేటి, అధ్యాపకులు సోమశేఖర్, రఘునందన్, పాల్గొన్నారు.
Advertisement
Advertisement