రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక
గుంటూరు ఎడ్యుకేషన్: విజయనగరంలో ఈనెల 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగనున్న రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు భాష్యం హైస్కూల్ 10వ తరగతి విద్యార్థి బోడేపూడి మహేష్ చంద్ర ఎంపికైనట్లు భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ తెలిపారు. చంద్రమౌళీనగర్‌లోని భాష్యం ప్రధాన క్యాంపస్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 15న రేపల్లెలోని ఏవీఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీలో క్యాడెట్ కేటగిరిలో మహేష్ చంద్ర బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నట్లు వివరించారు. ఈసందర్భంగా మహేష్ చంద్రను, కోచ్ ఎస్‌కే రషీద్, జోనల్ ఇన్‌చార్జ్ తలశిల శివ, మెయిన్ క్యాంపస్ ప్రిన్సిపాల్ కిషోర్ అభినందించారు.