Taekwando
-
23 నిమిషాల్లో 2005 కిక్స్.. తైక్వాండోలో బాలిక ప్రతిభ
సాక్షి, హైదరాబాద్: 23 నిమిషాల్లో 2005 కిక్స్ కొట్టి... గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది హైదరాబాద్‌కు చెందిన శ్రీహాస. కోవిడ్ నేపథ్యంలో మైదానానికి దూరంగా ఉన్నా.. ఆన్లైన్లో శిక్షణ పొంది ఈ ఘనత సాధించింది. నగరంలోని సైనిక్‌పురి ప్రాంతానికి చెందిన జేవీ శ్రీరామ్, పావనిల కూతురు జొన్నలగడ్డ వెంకట సాయి శ్రీహాస. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 13 ఏళ్ల వయసులోనే తైక్వాండోలో అత్యంత ప్రతిభ చూపిస్తోంది. ఏపీలోని ఈశ్వర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్స్ ఈశ్వర్, విశ్వ దగ్గర శిక్షణ పొంది, గతంలో 20 నిమిషాల్లో 1400 ఫ్రీ కిక్స్ కొట్టింది. ఆ రికార్డును బద్దలు కొట్టాలని అహర్నిశలు సాధన చేసింది. ఇంటర్నెట్లో తైక్వాండో వీడియోలు చూసి మెళకువలు నేర్చుకుంది. ఈ ఏడాది మే నెల్లో గిన్నిస్ రికార్డు బృందం ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో నిమిషానికి ఒక సెట్ చొప్పన 23 సెట్లలో 2005 తైక్వాండో క్లిక్స్ కొట్టి శ్రీహాస కొత్త రికార్డు సృష్టించింది. రివ్యూ పూర్తయిన అనంతరం ఆదివారం కృష్ణాజిల్లా నాగాయలంకలోని అకాడెమీలో శ్రీహాసకు గిన్నిస్ రికార్డు సరి్టఫికెట్‌ను అందజేశారు. శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ మండలం నీలంపేట వీరి స్వస్థలం. చదవండి: ఇంజనీరింగ్ విద్యార్థుల పేరెంట్స్‌కు బిగ్ షాక్..! -
తైక్వాండోలో గిన్నిస్ రికార్డు అటెంప్ట్
మంగళగిరి: తైక్వాండోలో ఒకే సారి మూడు వందల మంది క్రీడాకారులతో 30 నిమిషాల పాటు నిర్విరామంగా కిక్స్, పంచెస్, బ్లాక్స్‌ను ప్రదర్శించి గిన్నిస్ బుక్ అటెంప్ట్ నిర్వహించినట్లు అభి తైక్వాండో అకాడమి మాస్టర్ చిల్లపల్లి నరేంద్రకుమార్ తెలిపారు. నాగార్జున యూనివర్సిటీ ఎదుట జెమ్స్ పబ్లిక్ స్కూలు ఆవరణలో ఆదివారం క్రీడాకారులు చేసిన ప్రదర్శనలను వీడియో తీశారు. ఆ వీడియోను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌కు పంపించనున్నట్లు ఆయన తెలిపారు. క్రీడాకారులను మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి అభినందించారన్నారు. -
తైక్వాండో పోటీలకు దివ్యజ్యోతి
తెనాలి రూరల్ : రాష్ట్ర స్థాయి తైక్వాండో, జాతీయ స్థాయి టాంగ్ సూడో పోటీలకు పట్టణ ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన గుంటూరులో జరిగిన సెలక్షన్స్‌లో కళాశాలకు చెందిన యు.దివ్యలక్ష్మి తైక్వాండోలో అండర్ 19, 58 కిలోల విభాగంలో అర్హత సాధించింది. అలాగే గోవాలో అక్టోబర్ 24 నుంచి 26 వరకు జరుగనున్న టాంగ్‌సూడో జాతీయ పోటీలకు సుంకర అలేఖ్య అర్హత పొందింది. విద్యార్థినులు, కోచ్ కె.శ్రీనివాసరావును శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీన్ ఉమామహేశ్వరరావు, రాంబాబు, శివన్నారాయణ, సురేష్ తదితర అధ్యాపకులు అభినందించారు. -
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో సిక్కోలు ప్రతిభ
– ఐదు గోల్డ్‌తో కలిపి మొత్తం12 పతకాలు కైవశం శ్రీకాకుళం న్యూకాలనీ: విజయనగరం తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు విజయనగరం ఇండోర్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి క్యాడెట్, జూనియర్ బాలబాలికల తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీల్లో సిక్కోలు క్రీడాకారులు సత్తా చూపారు. పతకాల పంట పండించారు. ఐదు బంగారు, రెండు రజత, మరో ఐదు కాంస్య పతకాలు సాధించి శభాష్ అనిపించారు. క్రీడాకారులను, కోచ్ దుర్గాప్రసాద్, శివకుమార్, దయామయిలను ఎంపీ కె.రామ్మోహన్నాయుడు తన కార్యాలయంలో బుధవారం అభినందించారు. కార్యక్రమంలో తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం కార్యదర్శి కొమర భాస్కరరావు, సంయుక్త కార్యదర్శి సత్యప్రసాద్, కోశాధికారి కె.శ్రీనివాసరావు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. పతకాలు సాధించినవారు వీరే.. 48 కేజీల విభాగంలో జి.జ్యోతీష్‌రెడ్డి, 51 కేజీల విభాగంలో ఆర్.వాసుదేవ్, 46 కేజీల విభాగంలో కౌసల్య మహాపాత్రో, 68 కేజీల విభాగంలో శరీన్, 41 కేజీల విభాగంలో ఎ.భువనేశ్వరి, 55 కేజీల విభాగంలో పి.సేవితలు బంగారు పతకాలు సాధించారు. 68 కేజీల విభాగంలో వై.రమేష్, 46 కేజీల విభాగంలో ఎస్.సంగీతలు రజత పతకాలు సాధించారు. ఇక 63 కేజీల విభాగంలో కె.హారిక, 44 కేజీల విభాగంలో ఎస్.శివానీ, 33 కేజీల విభాగంలో ఎ.జయశ్రీ, 33 కేజీల విభాగంలో ఎల్.తారకేష్, 45 కేజీల విభాగంలో ఆర్.కుమార్‌లు కాంస్య పతకాలు సాధించారు. -
‘తైక్వాండో’ ధీరులకు బహుమతులు
రేపల్లె: పట్టణంలోని ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడాప్రాంగణంలో ఈ నెల 15వ తేదీన అండర్–14, అండర్–17 విభాగాలలో నిర్వహించిన రాష్ట్ర తైక్వాండో ట్రైల్స్, జిల్లా తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బుధవారం క్రీడాప్రాంగణంలో మున్సిపల్ చైర్మన్ తాడివాక శ్రీనివాసరావు బహుమతులు ప్రదానం చేశారు. గెలుపొందిన క్రీడాకారులు ఈ నెల 27 నుంచి విజయనగరంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో తైక్వాండో అసోసియేషన్ జిల్లా సెక్రటరీ కే.జగన్మోహనరావు, పీఈటీ బుజ్జి తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. అండర్–17 జూనియర్ బాలుర విభాగంలో నరసరావుపేటకు చెందిన ఎం.వి.ఎన్.మణికంఠ, పి.చైతన్యకుమార్, గుంటూరుకు చెందిన వి.వి.సాయిరామ్‌కుమార్, డి.పార్థుశివసాయికుమార్, కొల్లూరుకు చెందిన ఎన్.పవన్‌కుమార్, రేపల్లెకు చెందిన కె.క్రాంతివర్మ, పి.రాజదేవ్కుమార్, జి.హరి, కె.నాగవంశీ, బాలికల విభాగంలో రేపల్లెకు చెందిన చైతన్య, సాయిశర్వాణీ, గుంటూరుకు చెందిన జె.ఉమామహేశ్వరి, అండర్–14 విభాగంలో గుంటూరుకు చెందిన వి.హర్షవర్థనరెడ్డి, జె.దేశ్‌ముఖ్, మహేష్, తెనాలికి చెందిన దేవకీనందన్, కొల్లూరుకు చెందిన ధీరజ్ నాగసాయికుమార్, నరసరావుపేటకు చెందిన మోహన్‌గోపాల్, బాలికల విభాగంలో గుంటూరుకు చెందిన వై.జ్ఞానశివాని, కె.యశశ్విని, టి.లక్ష్మీలావణ్య, తెనాలికి చెందిన టి.లావణ్య, కొల్లూరుకు చెందిన ఆర్పీ మమత, నరసరావుపేటకు చెందిన డి.భానుసాయిలక్ష్మి, రేపల్లెకు చెందిన వి.లిఖితా మనోజ్ఞ విజయం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. వీరిని పలువురు అభినందించారు. -
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక
గుంటూరు ఎడ్యుకేషన్: విజయనగరంలో ఈనెల 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగనున్న రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు భాష్యం హైస్కూల్ 10వ తరగతి విద్యార్థి బోడేపూడి మహేష్ చంద్ర ఎంపికైనట్లు భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ తెలిపారు. చంద్రమౌళీనగర్‌లోని భాష్యం ప్రధాన క్యాంపస్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 15న రేపల్లెలోని ఏవీఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీలో క్యాడెట్ కేటగిరిలో మహేష్ చంద్ర బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నట్లు వివరించారు. ఈసందర్భంగా మహేష్ చంద్రను, కోచ్ ఎస్కే రషీద్, జోనల్ ఇన్చార్జ్ తలశిల శివ, మెయిన్ క్యాంపస్ ప్రిన్సిపాల్ కిషోర్ అభినందించారు. -
తైక్వాండో పోటీల్లో ప్రతిభ
మారీసుపేట: జిల్లా తైక్వాండో పోటీలలో తెనాలి సీఎంసీ ఫిటెనెస్ జోన్ తైక్వాండో అకాడమీకి చెందిన ఏడుగురు క్రీడాకారులు ఆరుగురు పతకాలు సాధించారని మేనేజింగ్ డైరెక్టర్ కొక్కిలగడ్డ ప్రసాదబాబు మంగళవారం తెలిపారు. జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం రేపల్లెలో పోటీలు జరిగాయని చెప్పారు. ఎస్.దేవకీనందన్, ఎస్.దేవిక్షకర్ బంగారు పతకాలు, ఎం నూతన్ సాయినాథ్, సిహెచ్ కిరణ్ కుమార్ వెండి పతకాలు, బి.గోపినాథ్, ఎం జోశ్రీత కాంస్య పతకాలు సాధించినట్లు తెలిపారు. వీరిని చంద్స్ జిమ్ మేనేజింగ్ డైరెక్టర్ చందు వెంకటేశ్వరరావు, కొక్కిలగడ్డ ప్రసాదబాబు, తైక్వాండో మాస్టర్ ఎం బాజీ అభినందించారు.