తైక్వాండోలో గిన్నిస్ రికార్డు అటెంప్ట్
మంగళగిరి: తైక్వాండోలో ఒకే సారి మూడు వందల మంది క్రీడాకారులతో 30 నిమిషాల పాటు నిర్విరామంగా కిక్స్, పంచెస్, బ్లాక్స్‌ను ప్రదర్శించి గిన్నిస్ బుక్ అటెంప్ట్ నిర్వహించినట్లు అభి తైక్వాండో అకాడమి మాస్టర్ చిల్లపల్లి నరేంద్రకుమార్ తెలిపారు. నాగార్జున యూనివర్సిటీ ఎదుట జెమ్స్ పబ్లిక్ స్కూలు ఆవరణలో ఆదివారం క్రీడాకారులు చేసిన ప్రదర్శనలను వీడియో తీశారు. ఆ వీడియోను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌కు పంపించనున్నట్లు ఆయన తెలిపారు. క్రీడాకారులను మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి అభినందించారన్నారు.