
సాక్షి, అమరావతి: రాష్ట్ర క్రీడాకారులు పతకాలే లక్ష్యంగా జాతీయ పోటీల్లో రాణించాలని పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులశాఖ మంత్రి ఆర్కే రోజా కోరారు. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 10 వరకు గుజరాత్‌లో జరగనున్న 36వ నేషనల్ గేమ్స్‌లో పాల్గొనేందుకు పయనమైన 170 మంది రాష్ట్ర క్రీడాకారులను బుధవారం ఆమె అభినందించారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ధర్మాన కృష్ణదాస్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు.