national competitions
-
పతకాలే లక్ష్యంగా రాణించాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర క్రీడాకారులు పతకాలే లక్ష్యంగా జాతీయ పోటీల్లో రాణించాలని పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులశాఖ మంత్రి ఆర్కే రోజా కోరారు. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 10 వరకు గుజరాత్లో జరగనున్న 36వ నేషనల్ గేమ్స్‌లో పాల్గొనేందుకు పయనమైన 170 మంది రాష్ట్ర క్రీడాకారులను బుధవారం ఆమె అభినందించారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ధర్మాన కృష్ణదాస్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దేశంలోనే నంబర్‌వన్ ఏపీ ఆక్టోపస్
సాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీసు శాఖ జాతీయ స్థాయిలో మరో ఘనత సాధించింది. జాతీయ భద్రతా దళ విభాగం (ఎన్ఎస్జీ) ‘అగ్ని పరీక్ష–7’ పేరుతో హరియాణాలో ఈ పోటీలు నిర్వహించింది. ఇందులో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లు, వివిధ ఆయుధాలతో ఫైరింగ్, మారథాన్ రన్నింగ్, శారీరక ధారుడ్య పోటీలు నిర్వహించారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ ఆక్టోపస్ బృందం మొదటి స్థానం దక్కించుకుంది. ఈ పోటీల్లో ఎన్‌ఎస్‌జీతోపాటు ఎనిమిది రాష్ట్రాలకు చెందిన బృందాలు పాల్గొన్నాయి. ఏపీ అక్టోపస్ విభాగం మొదటి స్థానం సాధించడమే కాకుండా ఉత్తమ జట్టుగా కూడా నిలిచింది. రాష్ట్రానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎ.పాపారావు ఉత్తమ ఆల్‌రౌండర్‌గా ఎంపికయ్యారు చదవండి: (TTD: టీటీడీ సేవలన్నింటికీ ఒకే యాప్) -
మిస్టర్ తెలంగాణగా ఎంపికైన సింగరేణి బిడ్డ
సాక్షి, గోదావరిఖని(ఆదిలాబాద్): జాతీయస్థాయిలో జరిగిన మిస్టర్ అండ్ మిస్ ఇండియా అందాల పోటీల్లో మిస్టర్ తెలంగాణ టైటిల్ సాధించి సింగరేణి కార్మికుడి బిడ్డ సత్తా చాటాడు. జాతీయస్థాయి అందాల పోటీలు ఈనెల 1 నుంచి 5 వరకు ఢిల్లీలోని ఆగ్రాలో జరిగాయి. ఈ పోటీల్లో సింగరేణి కార్మికుడి కుమారుడు రేణికుంట చరణ్ మిస్టర్ తెలంగాణా టైటిల్ సాధించాడు. ఆగ్రాలో జరిగిన ఈ పోటీల్లో ఫైనల్‌కు చేరుకుని బెస్ట్ఫైవ్లో నిలిచి మిస్టర్ తెలంగాణా టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–1లో ఈపీ ఆపరేటర్‌గా పనిచేస్తూ యైటింక్లయిన్‌కాలనీలో ఉంటున్న రేణికుంట శ్రీనివాస్ కుమారుడు రేణికుంట మారుతిచరణ్ సికింద్రాబాద్ సర్ధార్‌పటేల్ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గతంలో అండర్–19 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొన్నాడు. అనంతరం మోడలింగ్‌వైపు దృష్టి సారించాడు. ఈ క్రమంలో మిస్టర్ ఇండియా అందాల పోటీలో పాల్గొని మిస్టర్ తెలంగాణా టైటిల్‌కు ఎంపికయ్యాడు. స్టార్లైఫ్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో ఈనెల 1 నుంచి 5 వరకు ఢిల్లీలో మిస్టర్‌అండ్‌మిస్ ఇండియా పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో అన్ని రాష్ట్రాలకు చెందిన 60 మంది పాల్గొనగా, మిస్టర్ ఇండియా టాప్‌ఫైవ్ ఫైనల్ లిస్ట్‌కు చేరుకున్నాడు. దీంతోపాటు మిస్టర్ తెలంగాణా టైటిల్ సాధించాడు. ఈ పోటీల తర్వాత ఇండియా కల్ట్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్ వీక్ పాల్గొనేందుకు ఆహ్వానం అందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సినిమాల్లో నటించాలని ఉంది భవిష్యత్‌లో సినిమాల్లో నటించాలని ఉంది. యాడ్‌షూట్‌లో బ్రాండ్ అంబాసిడర్‌గా నిలవాలని ఉంది. గతంలో రాష్ట్రస్థాయి మిస్టర్‌అండ్‌మిస్ హైదరాబాద్ పోటీల్లో పాల్గొని మిస్టర్ ఫోటోజెనిక్ హైదరాబాద్ టైటిట్ సాధించా. మిస్టర్ అండ్మిస్ ఏషియా సెమిఫైనల్స్ జూన్నెలలో జరగ్గా అందులో పాల్గొని ఫైనల్స్ చేరుకున్నా. మిస్టర్‌అండ్‌మిస్ బాలీవుడ్ హైదరాబాద్‌లో జరిగిన పోటీల్లో సెమిఫైనల్స్ అర్హత సాధించా. సెమిఫైనల్ పోటీలు జరగాల్సి ఉన్నాయి. – రేణికుంట చరణ్, టైటిల్ విజేత చదవండి: AP: అరుదైన ఆలయం.. భారతమాతకు వందనం -
ఆర్యభట్ట మ్యాథ్స్ కాంపిటీషన్; మొదటి విజేతకు లక్షన్నర
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ స్కిల్ డవలప్మెంట్(ఏఐసీటీఎస్‌డీ), ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థులతో కలిసి ఆర్యభట్ట నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తోంది. మ్యాథమెటిక్స్‌లో ప్రతిభావంతులను గుర్తించి.. భవిష్యత్ టెక్నాలజీ సైంటిస్ట్‌లుగా ఎదిగేలా ప్రోత్సహించేందుకు ఈ పరీక్ష జరుపుతోంది. ఈ ఏడాదికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఆర్యభట్ట నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్‌కు అర్హతలు, ప్రయోజనాలు, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం.. అర్హతలు దేశంలోని ఏదైనా కళాశాల, లేదా పాఠశాల విద్యార్థులు ఆర్యభట్ట నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 10ఏళ్ల నుంచి 24ఏళ్లలోపు ఉండాలి. జాతీయ స్థాయి పోటీలో తమ మ్యాథమెటిక్స్ నైపుణ్యాలను ప్రదర్శించాలనే అభిలాష ఉండాలి. ప్రయోజనాలు పరీక్షలో ప్రతిభ చూపిన టాప్ 20 మందిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో టాప్ –3ని విజేతలుగా ప్రకటిస్తారు. మొదటి విజేతకు రూ.1.5 లక్షలు, రెండో విజేతకు రూ.50 వేలు, మూడో విజేతకు రూ.పదివేలు అందిస్తారు. దీంతోపాటు ఏఐసీటీఎస్‌డీ ధ్రువపత్రం, నేషనల్ మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ ట్రోఫీ ఇస్తారు. అదేవిధంగా రోబోటిక్స్ ఆటోమేషన్, సాఫ్ట్వేర్స్ విత్ ఇండస్ట్రియల్ ప్రొఫెషనల్స్‌లో ఉచిత శిక్షణ లభిస్తుంది. అంతేకాకుండా ఏఐసీటీఎస్‌డీ నిర్వహించే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కూడా పొందొచ్చు. స్కాలర్షిప్కు కూడా అవకాశం ఉంది. పరీక్ష విధానం! పరీక్ష ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. ఇంటి నుంచే రాయొచ్చు. ప్రశ్న పత్రం ఆబ్జెక్టివ్ విధానం(ఎంసీక్యూ)లో ఉంటుంది. 30 ప్రశ్నలకు– 60 మార్కులు కేటాయించారు. పరీక్ష సమయం 45 నిమిషాలు. నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత వేస్తారు. ల్యాప్‌ట్యాప్ లేదా పీసీ ద్వారా పరీక్షకు హాజరుకావచ్చు. రాత పరీక్షలో ప్రతిభ చూపిన టాప్ 20 మందికి ఆన్లైన్ లైవ్ ఇంటర్వ్యూ ఇంటి నుంచే హాజరుకావచ్చు. ► పది నుంచి పదమూడేళ్ల వయసు విద్యార్థులకు గ్రూప్–1 విభాగం పరీక్ష; 14ఏళ్ల నుంచి 17 ఏళ్ల వయసు విద్యార్థులకు గ్రూప్–2 విభాగం పరీక్ష; 18ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయసు విద్యార్థులకు గ్రూప్–3 విభాగం పరీక్ష ఉంటుంది. ఆయా విభాగం పరీక్షలకు సిలబస్ భిన్నంగా ఉంటుంది. ► గ్రూప్–1 విభాగం విద్యార్థులకు చైన్ రూల్, పర్సంటేజెస్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, యావరేజెస్, నంబర్ సిస్టమ్, టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ క్యాలెండర్ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ► గ్రూప్–2 విభాగం విద్యార్థులకు కంపేరింగ్ క్వాంటిటీస్, ఏజెస్, ట్రైన్స్, టైమ్ అండ్ వర్క్, ట్రూ డిస్కౌంట్, చైన్ రూల్, హెచ్‌సీఎఫ్ అండ్ ఎల్సీఎం, ప్రాఫిట్ అండ్ లాస్ అంశాలపై ప్రశ్నలు ఎదురవుతాయి. ► గ్రూప్–3 వి«భాగం విద్యార్థులకు ప్రాఫిట్ అండ్ లాస్,రేషియో అండ్ ప్రపోర్షన్,స్పీడ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంటరెస్ట్, టైమ్ అండ్ వర్క్, ట్రైన్స్, చైన్ రూల్, ఏజెస్‌పై ప్రశ్నలు అడుగుతారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.290. మొదట దరఖాస్తు చేసిన పదివేల మందిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ► దరఖాస్తులకు చివరి తేది: 20.05.2021 ► ఆన్లైన్ పరీక్ష తేది: 10.06.2021 ► తుది ఫలితాల వెల్లడి: 30.06.2021 ► వెబ్సైట్: https://www.aictsd.com/aryabhatta-national-maths-competition After 10th Class: టెన్త్.. టర్నింగ్ పాయింట్! -
తైక్వాండోలో పీబీ సిద్ధార్థ విద్యార్థికి రజత పతకం
విజయవాడ స్పోర్ట్స్ : మానస సరోవర్‌లో ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకూ జరిగిన మూడో స్టూడెంట్స్ జాతీయ ఒలింపిక్ అసోసియేషన్ మీట్లో తైక్వాండోలో పీబీ సిద్ధార్థ విద్యార్థి ఎం.వెంకటసాయి రజత పతకం సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీఎన్ పద్మారావు తెలిపారు. 22 ఏళ్ల కేటగిరీలో వెంకటసాయి రజత పతకం సాధించినట్లు చెప్పారు. సీనియర్ తైక్వాండో కోచ్ ఎం.అంకమ్మరావు వద్ద వెంకటసాయి శిక్షణ పొందుతున్నాడు. జాతీయ స్థాయిలో పతకం సాధించిన వెంకటసాయిని పీబీ సిద్ధార్థ కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మారావు, పీడీ డాక్టర్ ఎన్.శ్రీనివాస్ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.