
సాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీసు శాఖ జాతీయ స్థాయిలో మరో ఘనత సాధించింది. జాతీయ భద్రతా దళ విభాగం (ఎన్‌ఎస్‌జీ) ‘అగ్ని పరీక్ష–7’ పేరుతో హరియాణాలో ఈ పోటీలు నిర్వహించింది. ఇందులో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లు, వివిధ ఆయుధాలతో ఫైరింగ్, మారథాన్ రన్నింగ్, శారీరక ధారుడ్య పోటీలు నిర్వహించారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ ఆక్టోపస్ బృందం మొదటి స్థానం దక్కించుకుంది. ఈ పోటీల్లో ఎన్‌ఎస్‌జీతోపాటు ఎనిమిది రాష్ట్రాలకు చెందిన బృందాలు పాల్గొన్నాయి. ఏపీ అక్టోపస్ విభాగం మొదటి స్థానం సాధించడమే కాకుండా ఉత్తమ జట్టుగా కూడా నిలిచింది. రాష్ట్రానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎ.పాపారావు ఉత్తమ ఆల్‌రౌండర్‌గా ఎంపికయ్యారు
Comments
Please login to add a commentAdd a comment